మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nagababu: ఐదడుగుల మూడంగుళాల నటుడు పోలీసాఫిసర్ పాత్ర వేస్తె కామెడీగా ఉంటుంది!

ABN, Publish Date - Feb 26 , 2024 | 01:37 PM

.. ఆ మాటలు నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అన్నవి. అయితే అతను ఏ టాలీవుడ్ నటుడిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో అని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Varun Tej and Nagababu at the Operation Valentine pre release event

ఆదివారంనాడు 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కథానాయకుడు, మానుషీ చిల్లర్ కథానాయిక. హిందీ, తెలుగులో ఈ సినిమా మార్చి 1 న విడుదలవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు, అలాగే వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూడా ఈ వేడుకకి హాజరై భారతదేశ ఎయిర్ ఫోర్స్, మిలిటరీ గొప్పతనం గురించి రెండు మూడు సంఘటనలు చెప్పి మన మిలిటరీ ఎంత గొప్పది అనే విషయం విశదీకరించారు.

అలాగే ఈ సందర్భంలో తన కుమారుడు వరుణ్ గురించి మాట్లాడుతూ అతను సినిమా ఫలితాలతో సంభందం లేకుండా ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటాడు, రిస్క్ తీసుకుంటాడు. అలంటి రిస్కులు తీసుకున్నప్పుడు ఫెయిల్ అయ్యాడు కూడా, అలాంటప్పుడు అతను బాధపడతాడు, నేను బాధపడతాను అని చెప్పారు నాగబాబు. అలాంటి వైవిధ్యమున్న పాత్రలు చేస్తున్న తన కుమారుడు వరుణ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు నాగబాబు.

'కంచె' లాంటి సినిమా చేసాడు, అలాగే 'ఫిదా', 'తొలిప్రేమ' లాంటి ప్రేమ నేపధ్యం వుండే సినిమాలు కూడా చేస్తూ, 'గద్దలకొండ గణేష్' లాంటి ఒక టఫ్ పాత్ర చేసాడు వరుణ్. ఇప్పుడు అదృష్టం అతను ఈ ఆర్మీ పాత్ర చేస్తున్నాడు. వరుణ్ కి అద్భుతమైన పర్సనాలిటీ వుంది, ఒక్కోసారి కొన్ని పాత్రలు చెయ్యాలంటే మనిషి కూడా బాగుండాలి కదా. "ఒక 5 అడుగుల మూడు అంగుళాలు వున్నవాడు, స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నాడు అంటే అది చాలా కామెడీ గా ఉంటుంది, నువ్వు కాదు లేరా అనిపిస్తుంది, అదే ఒక ఆరడుగుల నటుడు చేసాడంటే అది చూడటానికి బాగుంటుంది," అని చెప్పారు నాగబాబు.

అయితే నాగబాబు ఇలా ఐదు అడుగుల మూడంగుళాల నటుడు పోలీసాఫీసరుగా కామెడీగా ఉంటుంది అని ఎవరిని ఉద్దేశించి అన్నారు అని సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే టాలీవుడ్ అలాంటి నటులు వున్నారు, పోలీసాఫిసర్ గా కూడా చేశారు. అందులో ఒక అగ్ర నటుడు కూడా రెండు మూడు సినిమాలో పోలీసాఫీసరుగా, అండర్ కవర్ ఏజెంట్ గా కూడా చేసాడు. మరి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారో, కానీ సామజిక మాధ్యమాల్లో మాత్రం ప్రస్తుతం నాగబాబు అన్న ఈ వీడియో వైరల్ అవుతోంది.

Updated Date - Feb 26 , 2024 | 01:37 PM