మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dil Raju Family: మోహన్ బాబు ఇంట్లో అద్వైత సమేతంగా ఆశిష్ రెడ్డి.. మ్యాటర్ ఏంటంటే?

ABN, Publish Date - Feb 07 , 2024 | 10:03 PM

ప్ర‌ముఖ‌ నిర్మాత‌, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రోజు ప్ర‌త్యేకంగా పెళ్లి కుమార్తె అద్వైత‌ స‌మేతంగా మోహ‌న్‌బాబు ఇంటికి వెళ్లి పెళ్లి ప‌త్రిక అంద‌జేశారు.

mohanbabu

ప్ర‌ముఖ‌ నిర్మాత‌, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు (Dil Raju) ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సోద‌రుడు శిరీష్ (Shirish) కుమారుడైన అశిష్ (Ashish) వివాహం సంద‌ర్భంగా గ‌త మూడు, నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల‌లోని సెల‌బ్రిటీల‌ను, రాజ‌కీయ నాయ‌కులను క‌లిసి ఆహ్వాన పత్రిక అంద‌జేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప్రభాస్ (Prabhas), జూ.ఎన్టీఆర్ (JR. NTR), నాగార్జున (Nagarjuna Akkineni) , వెంకటేష్ (Venkatesh), ర‌వితేజ (RaviTeja ) ల‌తో పాటు పొలిటీషియ‌న్స్‌ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ల‌కు దిల్ రాజు కుటుంబంతో సహా వెళ్లి వ్యక్తిగతంగా శుభలేఖలు అంద‌జేసి వివాహానికి ఆహ్వానించారు.


అయితే ఈ రోజు దిల్ రాజు (Dil Raju) ఫ్యామిలీ ప్ర‌త్యేకంగా పెళ్లి కుమార్తె అద్వైత‌ స‌మేతంగా మోహ‌న్‌బాబు ఇంటికి వెళ్లి పెళ్లి ప‌త్రిక అంద‌జేశారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్య‌మంలోకి రావ‌డంతో చాలా వైర‌ల్‌గా మారాయి.

దీంతో రెండు రోజులుగా అంత‌మందికి ఆహ్వాన ప‌త్రిక‌లు అంద‌జేసిన దిల్ రాజు కుటుంబం.. మోహ‌న్ బాబు (Mohan Babu)కు మాత్రం మొద‌టిసారిగా నూత‌న వ‌ధువు, వ‌రుడు ఇద్ద‌రు క‌లిసి స్వ‌యానా ప‌త్రిక అంద‌జేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

అయితే ఈ విష‌య‌మై దిల్ రాజు (Dil Raju) కుటుంబం క్లారిటీ ఇచ్చింది. భ‌క్త క‌న్న‌ప్ప సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా మోహ‌న్ బాబు (Mohan Babu) న్యూజిలాండ్‌లో ఉండాల్సి వ‌స్తుండ‌డంతో అశిష్ (Ashish), ఆద్వైతల పెళ్లికి హ‌జ‌రు కాలేనని తెల‌ప‌డంతో వ‌ధూవ‌రుల‌ను ప్ర‌త్యేకంగా త‌న ఇంటికి పిలిపించుకుని ఆశీర్వ‌దించినట్లు తెలిపారు.


Updated Date - Feb 07 , 2024 | 10:07 PM