Manchu Vishnu: నాన్న పుట్టిన రోజు... ఆ సర్‌ప్రైజ్‌!

ABN , Publish Date - Mar 16 , 2024 | 08:23 PM

మంచు విష్ణు కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. దానికి  వచ్చిన స్పందనకు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Manchu Vishnu: నాన్న పుట్టిన రోజు... ఆ సర్‌ప్రైజ్‌!

మంచు విష్ణు (manchu vishnu) కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. దానికి  వచ్చిన స్పందనకు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కన్నప్ప కథను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. తన తండ్రి పుట్టినరోజు నాడు కన్నప్పపై కామిక్‌ బుక్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘కన్నప్ప’ ఫస్ట్‌ లుక్‌పై ప్రేక్షకులు చూపించిన విశేష ఆదరణకు ధన్యవాదాలు.

మునుపెన్నడూ నేను ఇలాంటి పాత్ర చేయలేదు.  అందువల్ల ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసే ముందు కాస్త కంగారుపడ్డా. దేవుడి ఆశీస్సులతో ఇది చేస్తున్నా. కన్నప్ప, శ్రీకాళహస్తి కథ అందరికీ చెప్పేందుకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కన్నప్ప చరిత్ర గురించి ఎంతోమంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఉత్తరాదిలో చాలా మందికి ఆయన గురించి తెలియదు. ఒక్కొక్కరి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాస్త కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే మార్చి 19న కన్నప్ప కథను తెలియజేస్తూ ఫస్ట్‌ వాల్యూమ్‌ కామిక్‌ బుక్‌ విడుదల చేస్తున్నా. ఇదొక కథల పుస్తకం. నా తండ్రి, నేను అభిమానించే నటుడు మోహన్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ బుక్‌ విడుదల చేస్తాం. పుస్తకం కావాలనుకున్నవారు ఇన్‌స్టా గ్రామ్‌లో నాకు సందేశం పంపండి. మా సిబ్బంది తప్పకుండా మీకు వాటిని పంపిస్తారు. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కన్నప్ప కథ అందరికీ తెలియజేయాల్సిన బాఽధ్యత నాపై ఉంది’’ అని అన్నారు.  

Updated Date - Mar 16 , 2024 | 09:06 PM