scorecardresearch

Mahesh Babu: వామ్మో.. మహేష్ బాబు బ్యాగ్ ధర తెలిస్తే అంతే!

ABN , Publish Date - Oct 09 , 2024 | 05:52 PM

తాజాగా మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పాటు మహేష్ ధరించిన బ్యాక్ ప్యాక్ ప్రైస్ అందరిని నోటిపై చేయేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ బ్యాగేంటి.. దాని ప్రైస్ ఎంతంటే..

Mahesh Babu: వామ్మో.. మహేష్ బాబు బ్యాగ్ ధర తెలిస్తే అంతే!
Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కి ఐదు పదుల వయసు దగ్గరపడుతున్న అందంలో ఇరవై అన్న నమ్మేలా ఉంది పరిస్థితి. సీరియస్ డైట్‌తో పాటు తన జీవితాన్ని లగ్జరీ‌గా మెయింటేన్ చేస్తుంటాడు. తరుచు విదేశాలకు భార్య, పిల్లలని తీసుకెళ్తు ఆనందమైన జీవితాన్ని లీడ్ చేస్తుంటారు. అయితే జక్కన సినిమా కోసం మహేష్ సపరేట్ లుక్ మెయింటేన్ చేస్తున్నాడు. తాజాగా ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పాటు మహేష్ ధరించిన బ్యాక్ ప్యాక్ ప్రైస్ అందరిని నోటిపై చేయేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ బ్యాగేంటి.. దాని ప్రైస్ ఎంతంటే..


తాజాగా మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించరు. పింక్ హూడిలో రెడ్ ఫెరారీ క్యాప్ ధరించి తన భార్య నమ్రతా(Namratha Shirodkar)తో కలిసి విదేశాలకు పయనమయ్యాడు. ఈ విజువల్స్ చూసిన ఫ్యాన్స్ ఏమున్నాడ్రా 'బాబు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మహేష్ యెల్లో కలర్ లగ్జరియస్ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్‌ప్యాక్ ధరించారు. దీని ధర అక్షరాల రూ. 3,81,841.50. దీంతో అందరు నోటిపై వేలేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే తరుచుగా ఫారెన్‌కి చెక్కేసే మహేష్ ఈ ట్రిప్ పర్సనల్ ఫ్యామిలీ ట్రిప్పా, అమెరికాలో ఉన్న తన కొడుకు గౌతమ్ దగ్గరికి వెళ్తున్నాడా, రాజమౌళి సినీమా కోసమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 06:34 PM