Mahesh Babu: జర్మనీ దీనికోసమే వెళ్లానని చెప్పిన మహేష్ బాబు

ABN , Publish Date - Jan 22 , 2024 | 11:17 AM

మహేష్ బాబు తాను జర్మనీ ఎందుకు వెళ్లిందీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి చెప్పకనే చెప్పేసారు. చాలామంది అతని జర్మనీ పర్యటన మీదా ఊహాగానాలు చేశారు, కానీ మహేష్ బాబు ఎందుకు వెళ్లారంటే...

Mahesh Babu: జర్మనీ దీనికోసమే వెళ్లానని చెప్పిన మహేష్ బాబు
File picture of Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశాలకి వెళ్లినప్పుడు మహేష్ బాబు కుటుంబంతో వెళుతూ వుంటారు, కానీ ఈసారి ఒక్కరే వెళ్లడంతో చాలామంది అతని పర్యటన మీద ఊహాగానాలు చేశారు. ఇక మీడియాలో కూడా అనేకరకమైన వార్తలు వచ్చాయి, అందులో ఎక్కువగా రాజమౌళితో చెయ్యబోయే సినిమా కోసం సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే వెళ్లారు అని రాశారు. రాజమౌళి, మహేష్ బాబు ల చిత్ర ఈ ఏడాది మొదలవ్వబోతోంది, దీనికి వెయ్యి కోట్లు బడ్జెట్ అని కూడా అంటున్నారు.

maheshbabufitnesstrainer.jpg

దీనిమీద ఇన్ని కథనాలు వస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు తన జర్మనీ పర్యటన దేనికోసం వెళ్లారో చాలా క్లియర్ గా చెప్పేసారు. తన సామజిక మాధ్యమంలో తన ఫిట్ నెస్ ట్రైనర్ తో వున్న ఫోటో షేర్ చేసి ఎందుకు అక్కడికి వెళ్లిందీ చెప్పకనే చెప్పారు. మహేష్ బాబు, ఫిజికల్ ట్రైనింగ్, వైద్య చికిత్స నిమిత్తం జర్మనీలో వెళ్లారు. అక్కడ ప్రస్తుతం డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో, జర్మనీలో వున్న ప్రముఖ స్పా, బ్రెన్నర్స్ పార్క్-హోటల్ & స్పాలో శారీరక శిక్షణ పొందుతున్నారు.

ఆ డాక్టరు చాలామంది సెలెబ్రిటీస్ కి ఫిట్ నెస్ లో శిక్షణ ఇస్తుంటాడు. అతని ప్రత్యేకత కూడా ఎలా ఫిట్‌ గా ఉండాలి, ఎంటువంటి వ్యాయమ శిక్షణ తీసుకోవాలని చెపుతూ ఉంటాడు. మహేష్ బాబు వ్యక్తిగతంగా డాక్టర్ హ్యారీ కోనిగ్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. అయితే తన తదుపరి సినిమా రాజమౌళితో చేస్తున్నారు, అందుకోసం ప్రత్యేకంగా ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవాలని మహేష్ బాబు చూస్తున్నారు. అందుకోసం జర్మనీలో వున్న ఈ ప్రత్యేక డాక్టరుని కలిసి శిక్షణ తీసుకుంటున్నారని ఈ ఫోటోతో చెప్పేసారు.

Updated Date - Jan 22 , 2024 | 11:17 AM