బాగా ఎమోషనల్ అయిన మహేష్ బాబు, ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:52 AM

మహేష్ బాబు, త్రివిక్రమ్ మూడోసారి చేతులు కలిపిన చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న గుంటూరులో జరిగింది. ఈ వేడుకలో మహేష్ బాబు అభిమానులను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

బాగా ఎమోషనల్ అయిన మహేష్ బాబు, ఫోటోస్ వైరల్
Mahesh Babu at the pre release function held in Guntur

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరిగింది. ఈ వేడుకకు వేలాదిమంది మహేష్ బాబు అభిమానులు తరలివచ్చి ఈ వేడుకని జయప్రదం చేశారు. ఇదే వేడుకలో మహేష్ బాబు చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు.

maheshbabuguntur.gif

ఈ 'గుంటూరు కారం' సినిమా మొదలుపెట్టిన తరువాత మహేష్ బాబు తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారిని పోగొట్టుకున్నారు. అంతకు ముందు తల్లి ఇందిరాదేవిని కూడా పోగొట్టుకున్నారు. ఇలా తల్లిదండ్రులను ఒకే ఏడాది పోగొట్టుకొని వున్న బాధలో ఈ 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ చేశారు.

మధ్యలో కూడా ఎన్నో అవాంతరాలు, ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వచ్చినా సినిమా షూటింగ్ మాత్రం ఆగకుండా, జనవరి 12న విడుదల చేస్తున్నాం అని ఆ తేదీకే అనుకొని నిరంతరం పని చేశారు.

maheshbabuemotional.gif

ముందు పూజ హెగ్డే అనుకున్నారు, ఆమె తప్పుకుంది, ఆమెకి బదులుగా శ్రీలీల (Sreeleela) వచ్చింది, తరువాత మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా ఇందులో రెండో కథానాయికగా చేసింది. సినిమాటోగ్రఫర్ మధ్యలో తప్పుకున్నాడు, వేరే అతను వచ్చాడు, అయినా సినిమా అనుకున్నట్టుగానే పూర్తి చేసి అనుకున్న తేదీకి విడుదల చేస్తున్నారు.

maheshbabusmile.gif

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో జరగాల్సి వుండింది, కానీ ఇక్కడ అనుమతి దొరకలేదు, ఏమి చెయ్యాలా అని అలోచించి గుంటూరు పట్టణంలో చేద్దామని అక్కడ అనుమతి తీసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి గుంటూరులో ఈ వేడుకని నిన్న విజయవంతంగా నిర్వహించారు.

maheshbabuemotionalpic.gif

ఈ వేడుకకి వచ్చిన అభిమానుల సందోహాన్ని చూసి మహేష్ బాబు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. 'నాన్నగారు ఉంటే అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూసేవాడిని. అతను సినిమా ఎలా వుంది కలెక్షన్స్ అన్నీ చెప్పేవారు, ఇప్పుడు నాన్నగారు లేరు, నాకు అమ్మయినా, నాన్నయినా అన్నీ మీరే! మీరే నాకు సినిమా ఎలా వుందో చెప్పాలి," అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

maheshsreeleelaguntur.gif

ఆలా అంటున్న మహేష్ బాబుని చూసి అభిమానులు కూడా చాలా ఫీల్ అయ్యారు. తల్లిదండ్రులని కొన్ని నెలల వ్యత్యాసంలో పోగొట్టుకున్న మహేష్ బాబు బాధ చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో మహేష్ బాబు అన్న ఆ మాటలను చాలామంది పోస్ట్ చేస్తూ మేమున్నాం అని చెపుతున్నారు. ఆ మాటలు అన్న వీడియో, ఫోటోలు సామజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jan 10 , 2024 | 11:57 AM