Guntur Kaaram: మహేష్ బాబు కట్ అవుట్ వైరల్ అవుతోంది, ఎందుకంటే...

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:21 AM

ఒక ఫోటోని చూస్తే ఒక్కోసారి ఆ ఫోటోకి ఏమి రాయాలో చెప్పనవసరం లేదు, ఆ ఫోటోని చూస్తే చాలు ఎన్నో భావాలూ మైండ్ లో మెదులుతాయి. అలాటి మహేష్ బాబు ఫోటో ఒకటి నిన్నటి నుండి వైరల్ అవుతోంది, ఇంతకీ ఆ ఫోటో ఏంటి, ఎలా వుంది, ఎందుకు వైరల్ అవుతోంది అంటే...

Guntur Kaaram: మహేష్ బాబు కట్ అవుట్ వైరల్ అవుతోంది, ఎందుకంటే...
Fans happy seeing Mahesh Babu's 'Guntur Kaaram' trailer in a theater near RTC Cross Roads

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram ట్రైలర్ నిన్న ఆదివారం విడుదలైంది. మహేష్ బాబుని ఒక మాస్ అవతారంలో అభిమానులు చూడటంతో ట్రైలర్ అందరికీ విపరీతంగా నచ్చేసింది. ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో జరగాల్సి ఉండగా, అది రద్దు అయింది. అందుకని నిన్న ఆదివారం మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా ఆడే సుదర్శన్ థియేటర్ లో మహేష్ బాబు అభిమానులు సందడి చేశారు.

అందులో భాగంగానే మహేష్ బాబు కట్ అవుట్ లు 'గుంటూరు కారం' సినిమా నుండి థియేటర్ దగ్గర చాలా పెద్దగా పెట్టారు. అభిమానులు వేలమంది అక్కడికి చేరుకొని ట్రైలర్ విడుదలైనప్పుడు ఈలలు, గోలతో సందడి చేశారు. ఇది నిన్న హైలైట్ అనే చెప్పొచ్చు. గత కొన్ని రోజులనుండీ మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం' మేనియా తప్పితే ఇంకోటి కనించడటం లేదు అని కూడా అంటున్నారు.

అంతలా మహేష్ బాబు అభిమానులు రెండు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నారు. గత నెల రోజుల నుండీ, సంక్రాంతి పండగకి వచ్చే సినిమాల్లో 'గుంటూరు కారం' ప్రచారాన్ని మహేష్ అభిమానులు ప్రతి పట్టణంలోనూ తమ బుజాలమీదకి ఎత్తుకొని మరీ చేస్తున్నారు. అందుకే 'గుంటూరు కారం' సినిమా గురించే సంక్రాంతి పండగకి ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తుంటే మొదటి రోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయేట్టు వుంటాయని కూడా పరిశ్రమలో అంటున్నారు.

maheshbabupictureviral.jpg

ఇదిలా ఉంటే నిన్న మహేష్ బాబు అభిమానులు మహేష్ కట్ అవుట్ కి కాగితాల పూలజల్లు కురిపించారు. ఇలా కాగితాల పూల జల్లు వర్షంలా పడుతుంటే తీసిన మహేష్ బాబు కట్ అవుట్ ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈమధ్య కాలంలో తీసిన ఫోటోలలో ఇది బెస్ట్ అని కూడా అంటున్నారు. సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఈ ఫోటోనే వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ ఫోటోని చూస్తే ఎన్నో భావాలూ కలుగుతుంటాయి, అలాటి ఫోటో అది.

నిన్న విడుదలైన ట్రైలర్ లో మహేష్ బాబుని ఒక కొత్త అవతారంలో చూపించారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ట్రైలర్ డైలాగ్స్ అన్నీ మహేష్ బాబు గుంటూరు యాసలో చెపుతూ ఉంటే థియేటర్స్ లో అభిమానులు ఊగిపోతున్నారు, మరి సినిమాలో ఇలాంటివి చాలా వున్నాయి మరి అప్పుడు ఇంకెంత ఊగిపోవాలో అని కూడా అంటున్నారు. ట్రైలర్ లో ఒక డైలాగు చెప్పినట్టుగా రమణ గాడి లైఫ్ ఒక మిరాకిల్ రా బాబూ అన్నట్టుగా, మహేష్ బాబు కెరీర్ లో 'గుంటూరు కారం' ఒక మిరాకిల్ కానుందా? అని కూడా అంటున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:21 AM