నిజంగానే.. ‘కుర్చీ మ‌డ‌తెట్టేసిందిగా’! డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన మ‌హేశ్‌బాబు అన్న కూతురు

ABN , Publish Date - Feb 18 , 2024 | 09:51 PM

గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మ‌డ‌త పెట్టి పాట ఓ రేంజ్‌లో నెట్టింట‌ దుమ్ము దులుపుతోంది. రీసెంట్‌గా ఈ లిస్టులోకి మ‌హేశ్‌బాబు అన్న ర‌మేశ్‌బాబు కూతురు చేరింది.

నిజంగానే.. ‘కుర్చీ మ‌డ‌తెట్టేసిందిగా’! డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన మ‌హేశ్‌బాబు అన్న కూతురు
Ramesh Babu Daughter

తెలుగునాట సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఉన్న స్టార్‌డ‌మ్‌, ఫ్యాన్ బేస్ చాలా ప్ర‌త్యేకం. ఆయ‌న త‌ర్వాత మ‌హేశ్‌బాబు (Mahesh Babu) కృష్ణ వార‌స‌త్వాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తూ ఆ ఇమేజ్‌ను డ‌బుల్ చేశారు. మ‌ధ్య‌లో కృష్ణ గారి రెండో కుమారుడు ర‌మేశ్ బాబు (Ramesh Babu) కొన్ని సినిమాల‌తో అల‌రించినా కంటిన్యూ చేయ‌లేక పోయారు. చివ‌ర‌గా ఎన్‌కౌంట‌ర్ అనే చిత్రంలో తండ్రితో క‌లిసి న‌టించిన ర‌మేశ్‌బాబు (Ramesh Babu) త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చారు.

EkLtn8wU0AEStOP.jpg

కొంత‌కాలం త‌ర్వాత ర‌మేశ్‌బాబు నటన పక్కన పెట్టి మ‌హేశ్‌బాబు (Mahesh Babu)తో అర్జున్‌, అతిథి చిత్రాలు నిర్మించాడు. ఇదిలా ఉండ‌గా.. ర‌మేశ్‌బాబు కుమారుడు జ‌య‌కృష్ణ, మ‌హేశ్‌బాబు నిజం సినిమాలో ఓ పాట‌లో క‌నిపించాడు. ఇక ఈ త‌ర్వాత ర‌మేశ్ బాబు (Ramesh Babu) గానీ వారి పిల్ల‌లు గానీ సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. రమేశ్ బాబు ఆకస్మిక మృతి అనంతరం వారి పిల్లలు ఎవరైనా నటన వైపు అడుగులు వేస్తారేమో అంతా అనుకున్నారు. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు.


Ramesh-Babu-Family.jpg

అయితే తాజాగా మ‌హేశ్‌బాబు (Mahesh Babu) గుంటూరు కారం (Guntur Kaaram) సంక్రాంతికి విడుద‌లై మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని కుర్చీ మ‌డ‌త పెట్టి (#KurchiMadathapetti) పాట నేటికి ఓ దుమ్ము దులుపుతోంది. దీనికి అన్నీ ఇండ‌స్ట్రీల నుంచి అద్భుత రెస్పాన్స్ రావ‌డ‌మే గాక ఆ పాట‌తో తెగ‌ రీల్స్ చేస్తున్నారు.

Mahesh-Babu.jpg

రీసెంట్‌గా ఈ లిస్టులోకి మ‌హేశ్‌బాబు (Mahesh Babu) అన్న ర‌మేశ్‌బాబు (Ramesh Babu) కూతురు భార‌తి డ్యాన్స్ చేసిన‌ రీల్ బ‌య‌ట‌కు వ‌చ్చి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. రీల్‌లో డ్యాన్స్‌ చూసిన‌వారంతా ర‌మేశ్‌బాబు కూతురిలో ఇంత టాలెంట్ ఉందా.. శ్రీలీల (Sree leela) రేంజ్‌లో చేసిందంటూ తెగ‌ మెచ్చుకుంటున్నారు. పొగ‌డ్త‌ల వ‌ర్షంలో ముంచెత్తుతున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Feb 18 , 2024 | 10:22 PM