Manchu: మంత్రి కోమ‌టిరెడ్డిని క‌లిసిన మంచు ల‌క్ష్మి, మ‌నోజ్.. అందుకోస‌మేనా?

ABN , Publish Date - Feb 11 , 2024 | 12:14 PM

మంచు మోహ‌న్‌బాబు గారాల ప‌ట్టి మంచు ల‌క్ష్మి, ఆమె సోద‌రుడు మంచు మ‌నోజ్ శ‌నివారం రోజు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు.

Manchu: మంత్రి కోమ‌టిరెడ్డిని క‌లిసిన మంచు ల‌క్ష్మి, మ‌నోజ్.. అందుకోస‌మేనా?
manchu lakshmi

మంచు మోహ‌న్‌బాబు గారాల ప‌ట్టి మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu), ఆమె సోద‌రుడు మంచు మ‌నోజ్ (Manoj Manchu) శ‌నివారం రోజు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)ని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నూత‌నంగా బాధ్య‌తలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో మంచు ల‌క్ష్మి, మనోజ్ కొన్ని షూటింగ్‌లలో బిజీగా ఉండ‌డం, మంత్రి ఆనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేర‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల క‌ల‌వ‌లేక పోవ‌డంతో ఇన్నాళ్ల‌కు మంత్రిని క‌లిసి పూల‌బోకే అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

abd4da13-937a-4280-b71b-f4cc90a26846.jpg

ఇదిలాఉండ‌గా గ‌త కొంత‌కాలంగా మంచు ల‌క్ష్మి టీచ్ ఫ‌ర్ ఛేంజ్ (Teach for Change) అనే ఎన్టీవోను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా కొన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని వాటి డెవ‌ల‌ప్‌మెంట్‌కు, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు సాయం చేస్తోంది. గ‌త సంవ‌త్స‌రం రెండు రాష్ట్రాల‌లో 167 పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త తీసుకుంది.

అయితే ఈ ఎన్జీవోకు నిధులు స‌మ‌కూర్చే క్ర‌మంలో ఫిబ్రవరి11 (ఆదివారం) రోజున హైద‌రాబాద్‌లో ఓ ప్యాష‌న్ షో నిర్వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలోనే మంచు లక్ష్మి, మ‌నోజ్ (Manoj Manchu) మంత్రి కోమ‌టిరెడ్డి (Komatireddy Venkat Reddy) దంప‌తుల‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి ఈ ప్రోగ్రాంకు ఆహ్వ‌నించిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.


c4bdc039-a6d9-41a8-a965-4ac97ff8e429.jpg

గ‌తంలో ప‌లుమార్లు నిర్వ‌హించిన ఈ షోలో మ‌న టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్లు విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌, నిధి అగ‌ర్వాల్, జ‌యా బ‌చ్చ‌న్‌, అక్కినేని అఖిల్‌, అడ‌వి శేష్‌, సుశాంత్ ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు.

D2zc2DBUwAAQxgK.jpg

తాజాగా ఆదివారం నిర్వ‌హించ‌నున్న‌ కార్య‌క్ర‌మంలో శృతిహ‌సన్ (Shruti Haasan), హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రానే ( Harshvardhan Rane), శ్రీయ (Shriya Saran), అవంతిక మిశ్రా, సీర‌త్ క‌పూర్ (Seerat Kapoor), బిగ్‌బాస్ అలేఖ్య హ‌రిక‌, బ్యాట్మింట‌న్ ప్లేయ‌ర్స్ క‌శ్య‌ప్‌,సైనా నెహ్వాల్ వంటి సెల‌బ్రిటీలు పాల్లొన‌నున్నారు.

GF-GaJNWYAA_pE0.jpg

DyOGZkUVYAAIHiJ.jpg

Updated Date - Feb 11 , 2024 | 12:32 PM