Keerthy Suresh: అభిమానిని ఖుషీ చేసిన కీర్తి సురేశ్‌.. ఫ్యాన్స్ ఫిదా

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:26 PM

మ‌హాన‌టి సినిమాతో మొద‌లు పెట్టి వైవిధ్య‌భ‌రిత పాత్ర‌ల‌తో దేశ‌వ్యాప్తంగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి కీర్తి సురేష్‌. సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ‌కు ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. అయితే ఈ ఫ్యాన్స్ విష‌యంలోనే తాజాగా ఓ వార్త నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న‌ది.

Keerthy Suresh: అభిమానిని ఖుషీ చేసిన కీర్తి సురేశ్‌.. ఫ్యాన్స్ ఫిదా
keerthy suresh

మ‌హాన‌టి సినిమాతో దేశ‌వ్యాప్తంగా బాగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ (Keerthy Suresh) కెరీర్ ఒక్క అడుగు ముందుకేస్తే రెండ‌డుగులు వెనుక‌కు అన్న‌ట్లుగా ఉంది. ర2023లో తెలుగులో ద‌స‌రా, భోళా శంక‌ర్‌ రెండు సినిమాలు, త‌మిళంలో మామ‌న్న‌న్ అనే మూడు సినిమాలు చేయ‌గా ఈ యేడు తెలుగులో ఇప్ప‌టికీ ఒక్క సినిమా కూడా సంత‌కం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌ర్ల్ నెక్ట్స్ డోర్ వంటి క్యారెక్ట‌ర్ల‌తో మొద‌లు పెట్టి నిత్యం వైవిధ్య‌భ‌రిత పాత్ర‌ల‌ను చేసుకుంటూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. .

ఇప్ప‌టికే తేరి అనే త‌మిళ సినిమా బాలీవుడ్ రిమేక్ బేబీ జాన్‌లో వ‌రుణ్ దావ‌న్‌తో క‌లిసి న‌టిస్తుండ‌గా, ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది. అదే విధంగా త‌మిళంలో ర‌ఘు తాత‌, రివాల్వ‌ర్ రిటా, సైరెన్‌, క‌న్నివేడి వంటి నాలుగు చిత్రాల‌లో న‌టిస్తోంది కీర్తి సురేష్ (Keerthy Suresh). ఇప్ప‌టివ‌ర‌కు సౌత్ ఇండియా అన్ని ఇండస్ట్రీల‌లోను మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ న‌టికి ఫ్యాన్ బేస్ భారీగానే ఉండ‌గా సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈ ఫ్యాన్స్ విష‌యంలోనే తాజాగా ఓ వార్త నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న‌ది.


విష‌యానికి వ‌స్తే.. కృష్ణ అనే ఓ వీరాభిమాని కీర్తికి డైహ‌ర్డ్ ఫ్యాన్‌. ఈ క్ర‌మంలో కీర్తికి సోష‌ల్‌మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 233 లేఖలు రాయ‌డ‌మే కాకుండా వాటికి రిప్లై ఇవ్వాల‌ని చాలా సార్లు కోరాడు. చివ‌ర‌కు 234వ లెట‌ర్‌కు స్పందించిన కీర్తి (Keerthy Suresh) ఇంత ఆలస్యంగా స‌మాధానం ఇచ్చినందుకు క్షమాపణలు కోరింది. మీలాంటి అభిమాని నాకు ల‌భించ‌డం నా అదృష్టం అని, ఆ నెంబర్ నాకు ఫాంటసీ నెంబర్ అని చెప్పి తన అభిమానిని ఖుషీ చేసింది. స‌డ‌న్‌గా కీర్తి ఓ ఫ్యాన్ కామెంట్స్‌ను చ‌దివి స‌మాధానం ఇవ్వ‌డంతో ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల‌వుతూ ఆమె ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 02:26 PM