ఆమ్మో, జీవిత రాజశేఖర్ కూతురుని చూసారా, మరీ అంతలానా, ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:17 PM

జీవిత రాజశేఖర్ ల కుమార్తె శివాని రాజశేఖర్ సామజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆమె పెట్టిన కొన్ని ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే...

ఆమ్మో, జీవిత రాజశేఖర్ కూతురుని చూసారా, మరీ అంతలానా, ఫోటోస్ వైరల్
Shivani Rajasekhar

ఈమధ్యనే 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా విడుదలైంది. ఇది మలయాళం సినిమా 'నయట్టు' కి రీమేక్ గా తీశారు, ఇందులో శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషిస్తే, అతనితో పాటు జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా ఇంకో ప్రధాన పాత్ర పోషించింది. 'అద్భుతం' అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అయిన, శివాని తరువాత కొన్ని తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ వచ్చింది.

shivanirajasekharglamour.jpg

మొదటి సినిమా 'అద్భుతం' థియేటర్స్ లో విడుదల కాలేదు, ఎందుకంటే ఆ సమయంలో ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఇంకా థియేటర్స్ రావటం లేదు. అందుకని ఆ సినిమాని నేరుగా ఓటిటి లో విడుదల చేశారు. తేజ సజ్జ అందులో కథానాయకుడు, శివాని కథానాయిక. ఆ సినిమా కథా నేపధ్యం ఒక సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కథ.

shivanirajasekharhotphoto.jpg

రెండో సినిమా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు ఎక్కడ ఎందుకు)'. ఇది కూడా ఒక ప్రయోగాత్మక సినిమాగా రూపుదిద్దుకుంది. ఇది కూడా థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటిటి లో విడుదల చేశారు. శివాని మంచి నటి అని ఈ సినిమాల ద్వారా నిరూపించింది. కానీ ఆమెకి మంచి బ్రేక్ మాత్రం రాలేదు.

shivanirajasekharglamourpho.jpg

ఆ తరువాత రెండు తమిళ సినిమాలు కూడా చేసింది శివాని. కానీ అక్కడ కూడా అంతగా బ్రేక్ రాలేదనే చెప్పాలి. రాజశేఖర్ కుమార్తెగా 'శేఖర్' అనే సినిమాలో చేసింది. ఈ సినిమాకి శివాని తల్లి జీవిత దర్శకురాలిగా చేసింది. 2021 లో ఆరంగేట్రం చేసి, ఇలా ఒక ఐదారు సినిమాలు పూర్తి చేసి నటన మీద మంచి అనుభవం సంపాదించింది శివాని.

ఈమధ్యనే 'కోటబొమ్మాళి పీఎస్' విడుదలైంది. ఇందులో ఒక పోలీసు కానిస్టేబుల్ గా నటించింది. ఈ సినిమాలో శివాని చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది, కానీ ఈ సినిమా బ్రేక్ అయితే ఇవ్వలేకపోయింది.

shivanirajasekharhotpic.jpg

శివాని ఇపుడు ఒక మంచి బ్రేక్ కోసం చూస్తోంది. కథలు వింటోంది, తన పాత్రకి ప్రాముఖ్యం వున్న ఎటువంటి సినిమా అయినా చెయ్యడానికి రెడీ అని చెపుతోంది శివాని. అయితే సామజిక మాధ్యమాల్లో మాత్రం ఎప్పుడూ చురుకుగా ఉంటూ, తన తాజా ఫోటోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది శివాని. ఇప్పుడు అలాంటివి ఫోటోలనే సామజిక మాధ్యమాల్లో పెట్టి, అందరి కళ్ళు తనవైపు తిప్పుకునేట్టు చేసింది.

shivanirajasekharglam.jpg

ఈ ఫోటోలతో తాను గ్లామర్ పాత్రలను కూడా బాగా పోషించగలను అని చెప్పడానికి అన్నట్టుగా ఇవి పోస్ట్ చేసినట్టుగా కనపడుతోంది. చీరకట్టులో అచ్చమైన, అందమైన పదహారణాల తెలుగు అమ్మాయిలా కనపడుతున్న శివాని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jan 03 , 2024 | 01:17 PM