Allu Arjun: ఖైర‌తాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు అల్లు అర్జున్‌.. ఎగ‌బ‌డ్డ జ‌నం

ABN , Publish Date - Mar 20 , 2024 | 05:20 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బుధ‌వారం మైద‌రాబాద్‌లో సంద‌డి చేశారు. పుష్ఫ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయ‌న బుధ‌వారం కాస్త విరామం ఇచ్చారు. ఈ క్ర‌మంలో త‌న డ్రైవింగ్ లెసెన్స్ కోసం ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయానికి వ‌చ్చారు.

Allu Arjun: ఖైర‌తాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు అల్లు అర్జున్‌.. ఎగ‌బ‌డ్డ జ‌నం
allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బుధ‌వారం మైద‌రాబాద్‌లో సంద‌డి చేశారు. పుష్ఫ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయ‌న బుధ‌వారం కాస్త విరామం ఇచ్చారు. ఈ క్ర‌మంలో త‌న అంత‌ర్జాతీయ డ్రైవింగ్ లెసెన్స్ కోసం ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయానికి వ‌చ్చారు.

allu  arjun.jpeg

అదేవిధంగా అల్లు అర్జున్ (Allu Arjun) TG 09 0666 అనే నెంబ‌ర్ రేంజ్ రోవర్‌ కారును త‌న పేరుపై రిజిస్టేష‌న్ చేయించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కార్యాల‌య అధికారులు అర్జున్‌తో ఫార్మాలిటీస్ పూర్తి చేయించి అత‌నితో సంత‌కాలు చేయించుకున్నారు.


arju.jpeg

అయితే అనుకోకుండా అల్లు అర్జున్ (Allu Arjun) ఆర్టీవో ఆఫీస్‌కు రావ‌డంతో అక్క‌డ ఉన్న ప‌బ్లిక్‌తో పాటు అధికారులు ఫొటోలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. విష‌యం తెలుసుకున్న అభిమానులు అక్క‌డికి వ‌చ్చే స‌రికి పొలీసులు బందోబ‌స్తు క‌లిపించారు.

allu.jpeg

Updated Date - Mar 20 , 2024 | 05:20 PM