ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు హ‌నుమాన్ అశీస్సులు.. ఆఫీస్ డాబాపై చూశారా ఎవ‌రున్నారో?

ABN , Publish Date - Jan 12 , 2024 | 06:09 PM

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన హ‌నుమాన్ సినిమా అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తుండ‌గా. ఈ రోజు చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మకు ఓ గెస్ట్ స‌ర్‌ప్రైజ్ చేసి అనందాన్ని మ‌రింత‌గా పెంచేసింది.

ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు హ‌నుమాన్ అశీస్సులు.. ఆఫీస్ డాబాపై చూశారా ఎవ‌రున్నారో?
prasanth varma

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన హ‌నుమాన్ (Hanuman) సినిమా అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు గుంటూరు టాకీస్ సినిమాతో పోటీ ప‌డి రిలీజ్ అయిన ఈ చిత్రం టాలీవుడ్‌లో స‌రికొత్త రికార్డులు తిర‌గ రాస్తోంది. గుంటూరు టాకీస్ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుండంతో అంతా హ‌నుమాన్‌కే జై కొడుతున్నారు. అంతేగాక అందుతున్న స‌మాచారం ప్ర‌కారం కొన్నిచోట్ల హ‌నుమాన్ (Hanuman) సినిమాను ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్ల సంఖ్య‌ను పెంచ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


అయితే హ‌నుమాన్ (Hanuman) సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతితో పాటు స‌రికొత్త థ్రిల్లింగ్ అనుభ‌వాన్ని ఇస్తుండ‌గా ఈ రోజు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ (Prasanth Varma) కు ఓ గెస్ట్ స‌ర్‌ప్రైజ్ చేసి అనందాన్ని మ‌రింత‌గా పెంచేసింది. ఓ వాన‌రం అత‌ని ఆఫీస్‌కు వ‌చ్చి కాసేపు సంద‌డి చేసింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్‌లో అభిమానుల‌తో పంచుకోగా నెటిజ‌న్స్ బాగా వైర‌ల్ చేస్తున్నారు. అంతేగాక అ హ‌నుమంతుడే వ‌చ్చి మీకు ఆశీర్వాదం అందించాడ‌ని ఇక సినిమాకు ఎదురులేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 06:17 PM