Jyothi Rai: గుప్పెడంత‌మ‌న‌సు సీరియ‌ల్‌ న‌టి జ్యోతిరాయ్ ప‌ర్స‌న‌ల్ వీడియోలు లీక్‌.. నెట్టింట ర‌చ్చ‌ర‌చ్చ‌

ABN , Publish Date - May 09 , 2024 | 05:27 PM

ఇటీవ‌లే ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ స్కాండ‌ల్ ఇష్యూ బీజేపీని ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌కీయాల‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో ఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చి క‌న్న‌డ నాట సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

Jyothi Rai: గుప్పెడంత‌మ‌న‌సు సీరియ‌ల్‌ న‌టి జ్యోతిరాయ్ ప‌ర్స‌న‌ల్ వీడియోలు లీక్‌.. నెట్టింట ర‌చ్చ‌ర‌చ్చ‌
jyothi rai

ఇటీవ‌లే ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ స్కాండ‌ల్ ఇష్యూ బీజేపీని ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌కీయాల‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో ఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చి క‌న్న‌డ నాట సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే ఈసారి ఓ ప్ర‌ముఖ న‌టికి సంబంధించిన అశ్లీల వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో అస‌లు క‌ర్ణాట‌క‌లో ఏం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ చాలా హాట్‌గా జ‌రుగుతోంది. అస‌లు విష‌యానికి వ‌స్తే.. తెలుగునాట విజ‌య‌వంతంగా సాగుతోన్న గుప్పెడంత మ‌న‌సు టీవీ సీరియ‌ల్‌లో హీరో త‌ల్లిగా, జ‌గ‌తి మేడ‌మ్ అనే ఓ ప్ర‌ధాన పాత్ర‌లో కన్న‌డ న‌టి జ్యోతి రాయ్ (jyothirai) న‌టిస్తోంది.

jyothi-rai.webp

వృత్తిప‌రంగా సీరియ‌ల్స్‌లో త‌ల్లి, అత్త క్యారెక్ట‌ర్లు వేస్తున్న జ్యోతీరాయ్ (jyothirai) రియ‌ల్ లైఫ్‌లో అందుకు భిన్నంగా నేటి క‌థానాయిక‌లకు ధీటుగా త‌న డ్రెస్సింగ్‌, మోడ్ర‌న్ ఫొటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాలో పెద్ద ర‌చ్చే చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో విమ‌ర్శ‌లను సైతం ఎదుర్కుంటోంది. ఇదిలాఉండ‌గా అంత‌కు కొన్ని రోజుల ముందు అభి అనే ఓ యూట్యూబ‌ర్ న‌టి జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియోలు నా వద్ద ఉన్నాయి నా యూట్యూబ్ ఛాన‌ల్‌ను వెయ్యి మంది సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు బ‌య‌ట‌పెడ‌తానంటూ త‌న ఎక్స్ అకౌంట్‌లో బ‌హిరంగంగా పోస్టు చేయ‌డంతో ఒక్కసారిగా జ్యోతి రాయ్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

jyothirai.jpg


దీంతో ఈ అంశం రోజురోజుకు సీరియ‌స్ అవుతూ పెద్ద దుమార‌మే రేపుతోంది. స‌ద‌రు న‌టి, అభిమానులు రంగంలోకి దిగి ఇలాంటి వాటిని కావాల‌ని క్రియేట్ చేస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి వీడియోలు లీక్ కాలేద‌ని అదంతా అస‌త్య ప్ర‌చార‌మ‌ని నాకు అప్ర‌తిష్ట తెచ్చేందుకు ఎవ‌రో కావాలని కుట్రలు ప‌న్నుతున్నారంటు న‌టి జ్యోతి రాయ్ పేర్కొంది.

jyothi.jpeg

అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన‌వి అన్న‌ట్లుగా అభి ఎడిట్ అనే ప్రొఫైల్ నుంచి కొన్ని వీడియోలు లీక్ అయి సోష‌ల్‌మీడియాలో ఓ రేంజ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో న‌టి జ్యోతిరాయ్ (jyothirai) ఓ డైరెక్ట‌ర్‌తో చాలా స‌న్నిహితంగా ఉండ‌డం, ముద్దుల‌లో మునిగిన వీడియోలు, ఇంకా వేడి పుట్టించే ఇంటిమేట్ ఘ‌ట్టాలు ఉండ‌డంతో వాటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

rai.jpeg

తాజాగా లీక్ అయిన ప‌ర్స‌న‌ల్ వీడియోల గురించి న‌టి జ్యోతిరాయ్ (jyothirai) మీడియా ముందు ప్ర‌త్య‌క్షంగా తెల‌ప‌క‌పోయినా.. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్లలో మెసేజ్ పోస్టు చేసింది. అ వీడియోలు, ఫొటోల‌ను చూసి బాగా డిప్రెష‌న్‌లోకి వెళ్లాన‌ని, వీటికి సంబంధించి గ‌తంలోనే సైబ‌ర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాన‌ని తెలిపింది. ద‌య‌చేసి ఇలాంటి త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేస్తున్న‌వారిని త్వ‌ర‌గా ప‌ట్టుకొని శిక్షించాల‌ని లేకుంటే మున్ముందు ఇలాంటివి చాలా మందికి జ‌రిగి వారి వృత్తిపై, కుటుంబాల్లో తీవ్ర ఒడిదొడుకులు వ‌చ్చే అవ‌కాశ‌ముందంటూ పోస్టు చేసింది.

1.JPG

Updated Date - May 09 , 2024 | 06:00 PM