Super Star Fans: గుంటూరుకారం ట్రైల‌ర్‌.. ద‌ద్ద‌రిల్లిపోతున్న సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌

ABN , Publish Date - Jan 07 , 2024 | 06:40 PM

రెండు తెలుగు రాష్ట్రాలలో సూప‌ర్‌స్టార్‌ మ‌హేశ్‌బాబు అభిమానుల సంద‌డి మాములుగా లేదు. గుంటూరు కారం సినిమా ట్రైల‌ర్ విడుద‌ల నేప‌థ్యంలో ఈ రోజు (ఆదివారం) హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ 35 ఎంఎం థియేట‌ర్ వ‌ద్ద‌ అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. పెద్ద‌ పెద్ద బ్యాన‌ర్లు, క‌టౌట్లు ఏర్పాటు చేసి బాణా సంచా పేల్చి, ద‌ద్ద‌రిల్లే డీజే సౌండ్స్‌తో సంబురాలు చేసుకుంటున్నారు

Super Star Fans: గుంటూరుకారం ట్రైల‌ర్‌.. ద‌ద్ద‌రిల్లిపోతున్న సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌
gunturu kaaram

రెండు తెలుగు రాష్ట్రాలలో సూప‌ర్‌స్టార్‌ మ‌హేశ్‌బాబు అభిమానుల సంద‌డి మాములుగా లేదు. ఈ రోజు (ఆదివారం) గుంటూరు కారం సినిమా (GunturKaaram) ట్రైల‌ర్ విడుద‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ 35 ఎంఎం థియేట‌ర్ వ‌ద్ద‌ అభిమానులు నానా హంగామా చేస్తున్నారు.

పెద్ద‌ పెద్ద బ్యాన‌ర్లు, క‌టౌట్లు ఏర్పాటు చేసి బాణా సంచా పేల్చి, ద‌ద్ద‌రిల్లే డీజే సౌండ్స్‌తో సంబురాలు చేసుకుంటున్నారు. ఫ్రీ రిలీజ్ హైద‌రాబాద్‌లో క్యాన్సిల్ అవ‌డం గుంటూరులో వేడుక‌లు చేస్తార‌నే వార్త‌లు రావ‌డంతో ఏ స‌మ‌యంలోనైనా ట్రైల‌ర్ విడుద‌ల ఉంటుంద‌ని ఇక్క‌డి ఫ్యాన్స్ దీనినే పెద్ద ఈవెంట్‌గా జ‌రుపుకుంటున్నారు.


ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేయ‌గానే అన్‌లైన్‌లోకి వ‌స్తుంది గానీ థియేట‌ర్‌లో అయితే ఓ గంట ముంద‌స్తుగా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని వార్త‌లు రావ‌డంతో మ‌హేశ్ అభిమానులు ఉద‌యం నుంచే భారీ స్థాయిలో థియేట‌ర్‌కు చేరుకుని వారి అభిమాన హీరోను పొగుడుకుంటూ హంగామా చేస్తున్నారు. డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు.

ట్రైల‌ర్ రిలీజ్‌కే ర‌చ్చ ఇలా ఉంటే సినిమాకు మంచి టాక్ వ‌స్తే వీళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే అని నెట్టింట గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే గుంటూరుకారం సినిమా ట్రైల‌ర్ రాత్రి 8 గంట‌ల త‌ర్వాత విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముందని తెలుస్తోంది.

Updated Date - Jan 07 , 2024 | 06:56 PM