Chiranjeevi: ఆగిన చిరంజీవి ఆత్మకథ.. పుస్తకం..

ABN , Publish Date - Dec 23 , 2024 | 06:31 PM

సినిమా పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటుడిగా అవకాశాలు అందుకుని, ఉద్దండుల మధ్య నిలబడి తానేంటో నిరూపించకున్నారు చిరంజీవి. కష్టం, స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కి మెగాస్టార్‌ అయ్యారు చిరంజీవి.

సినిమా పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటుడిగా అవకాశాలు అందుకుని, ఉద్దండుల మధ్య నిలబడి తానేంటో నిరూపించకున్నారు చిరంజీవి (Chiranjeevi) . కష్టం, స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కి మెగాస్టార్‌ అయ్యారు చిరంజీవి. జీవితంలో ఎన్నో చూసిన ఆయనకు ఓ చిరకాల కోరిక ఉంది. ఆయన జీవితం చరిత్రలో గుర్తుండేలా ఓ పుస్తకం తీసుకురావాలనుకున్నారు. అదే ఆయన ఆత్మకథ (Chiranjeevi Aathma Katha) . ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు చిరు. కొన్నాళ్ల క్రితం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు సంబంధించిన ఓ వేడుకలో ఈ విషయాన్ని చెప్పారు. యండమూరి వీరేంద్రనాధ్‌ (yandamuri veerendranath) ఈ పుసక్తం రచనా బాధ్యతలు తీసుకున్నారని కూడా వెల్లడిరచారు. అలాగే రచన మొదలుపెట్టారని, సగం వరకూ పూర్తయింది. అయితే ఇప్పుడు చిరంజీవి పుస్తక రచన ఆగిపోయినట్లు తెలుస్తోంది. యండమూరి ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్ట్‌ అందుకు నిదర్శనం. ‘‘తన జీవిత చరిత్ర రాయడం మరి కొంతకాలం ఆపుదాం అన్నాడు చిరంజీవి. సగం రాసిన ఆ పుస్తకాన్ని మరికొన్ని నెలలు లేదా రెండు సంవత్సరాలు ఆపడం జరుగుతుంది. ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకు అని మనసుకు నచ్చిన మరో పుస్తకం మొదలుపెట్టాను’’ అని యండమూరి ఫేస్‌బుక్‌ వేదికగా తెలిపారు. దీన్ని చిరంజీవి ఆత్మకథ ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే దీని వెనకున్న కారణమేంటనేది తెలీదు. మళ్లీ యండమూరి ఎప్పుడు మొదలుపెడతారో కూడా తెలీదు.
ynm-a.jpg
అలాగే చిరంజీవి మీద ఓ డాక్యుమెంటరీ కూడా ప్లాన్‌ చేశారు. జి.కె మోహన్‌ ఆధ్వర్యంలో ఓ టీమ్‌ డాక్యుమెంటరీ కోసం కొన్ని ఇంటర్వ్యూలు చేసింది. అయితే ఇప్పుడు ఆ టీమ్‌ని చిరంజీవి తొలగించడం జరిగింది. దాంతో డాక్యుమెంటరీ పని కూడా ఓ పక్కన పడిరది. మరి చిరంజీవి ఆత్మకథ, డాక్యుమెంటరీలకు పూర్తి కావడానికి ఎంత టైమ్‌ పడుతుందో ఆ దిశ చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారా?అన్నది తెలియాల్సి ఉంది.


                     

Updated Date - Dec 23 , 2024 | 06:31 PM