ఇది క‌దా పండుగంటే.. చిరంజీవి ‘సంక్రాంతి’ ఫ్యామిలీ ఫొటో వైర‌ల్‌

ABN , Publish Date - Jan 15 , 2024 | 01:56 PM

మెగాస్టార్ ఇంట సంక్రాంతి (Sankranthi ) సంబురాలు అంబ‌రాన్నంటాయి. చిరంజీవి(Chiranjeevi) ఇంట్లోకి మ‌నుమ‌రాలు రావడం, వ‌రుణ్ తేజ్ లావ‌ణ్యల వివాహాల‌తో ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా ప్ర‌త్యేకంగా నిలిచింది. ఈ క్ర‌మంలో మెగా కుటుంబం అంతా నిన్న‌నే బెంగ‌ళూరులోని ఫాంహౌస్‌కు చేరుకుని పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు

ఇది క‌దా పండుగంటే.. చిరంజీవి ‘సంక్రాంతి’ ఫ్యామిలీ ఫొటో వైర‌ల్‌
chiranjeevi

మెగాస్టార్ ఇంట సంక్రాంతి (Sankranthi ) సంబురాలు అంబ‌రాన్నంటాయి. చిరంజీవి(Chiranjeevi) ఇంట్లోకి మ‌నుమ‌రాలు రావడం, వ‌రుణ్ తేజ్ లావ‌ణ్యల వివాహాల‌తో ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా ప్ర‌త్యేకంగా నిలిచింది. ఈ క్ర‌మంలో మెగా కుటుంబం అంతా నిన్న‌నే బెంగ‌ళూరులోని ఫాంహౌస్‌కు చేరుకుని పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారంతా క‌లిసి దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతూ దుమ్ము రేగ్గొడుతున్న‌ది. ఇది క‌దా అస‌లు పండుగంటే అని అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ పండ‌గ‌కి ఇప్పుడు క‌ళ వ‌చ్చిందంటూ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఆ ఫొటోస్‌పై మీరు ఓ లుక్కేయండి.

Updated Date - Jan 15 , 2024 | 03:10 PM