విశ్వంభర కోసం రెడీ అవుతున్న బాస్, వీడియో చూసారా

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:42 AM

చిరంజీవి తన తదుపరి సినిమా 'విశ్వంభర' కోసం జిమ్ కి వెళ్లి కసరత్తులు మొదలెట్టారు. అతని వ్యాయామం చేస్తున్న విధానం చూస్తుంటే ఒక యువకుడిలా ఈ వయస్సులో కూడా సినిమా కోసం ఎంత కష్టపడాలి అనే విషయం చెపుతున్నారు, ఇప్పుడున్న యువ నటులకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు

విశ్వంభర కోసం రెడీ అవుతున్న బాస్, వీడియో చూసారా
Chiranjeevi is all set to enter into Vishwambhara sets

కొన్ని రోజుల క్రితం 'పద్మవిభూషణ్' అందుకున్న చిరంజీవి తన తదుపరి సినిమా దర్శకుడు మల్లిడి వసిష్ఠతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'విశ్వంభర' అనే పేరు కూడా ఖరారు చేసి, సంక్రాంతికి వూరికే అలా సినిమా టైటిల్ ఒక చిన్న ప్రచార వీడియోని విడుదల చేస్తే అది ఎంత పెద్ద వైరల్ అయిందో కూడా తెలిసిన విషయమే. చిరంజీవి ఈరోజు నుండి ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెడుతున్నారు. ఇది ఒక ఫాంటసీ నేపథ్యంలో సాగే సినిమా. ఈ సినిమాకి చాలా ప్రీ ప్రొడక్షన్ పని చేశారు.

chiranjeeviboss.jpg

69 ఏళ్ళ చిరంజీవి ఈ సినిమా కోసం కొన్ని రోజుల నుండి జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. అసలు ఈ వయస్సులో చిరంజీవి ఉత్సాహం, అతను కసరత్తులు చేస్తున్న తీరు చూస్తుంటే ఒక యువ నటుడులా కనపడుతున్నారు. అతను అంత చురుకుగా చేస్తున్న ఆ కసరత్తులు వీడియో ఇప్పుడు విడుదల చేశారు, ఇది సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

chiranjeevibossviswambhara.jpg

ఇప్పుడొస్తున్న యువనటులకు చిరంజీవి ఈ వయసులో కూడా చేస్తున్న ఇటువంటి కసరత్తులు స్ఫూర్తినిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా చేస్తున్నప్పుడు ఎంత కష్టపడాలో చిరంజీవిని ఈ వీడియోలో చూస్తే అర్థం అవుతుంది. అతనే ఎన్నోమార్లు అన్నారు, కష్టపడకకుండా చెయ్యకపోతే ఎటువంటి ఫలితం రాదు అని. మొదటి షెడ్యూల్ లో భాగంగా సుమారు రెండు వారాలపాటు ఈ 'విశ్వంభర' సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది.

Updated Date - Feb 01 , 2024 | 11:49 AM