Viral: ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. స్టార్ హీరో కూతురు

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:26 PM

తన అందంతో యూత్‌ని మంత్ర ముగ్దులుని చేస్తున్న ఈ స్టార్ హీరో కూతురిని మీరు గుర్తుపట్టారా? ఇంతకీ ఆమె ఎవరు, ఏం చేస్తుందంటే..

ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈమె ఎవరు అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఈమె ఒక స్టార్ హీరో కూతురు అని తెలిసింది. అది కూడా మనందరికీ ఎంతో పరిచయమున్న నటుడే. ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన ఆ హీరో ఇప్పుడు పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఇంతకీ ఈ బ్యూటీ పేరేంటి. ఆమె తండ్రి ఎవరంటే..


ఈ ఫోటోలు కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు దివ్య సత్యరాజ్. అవును.. కట్టప్పగా పాన్ ఇండియా వైడ్ గా ఫేమస్ అయినా సత్య రాజ్ కూతురు ఈమె. సత్యరాజ్ కి ఇద్దరు సంతానం ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు సిబిరాజ్‌ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు. డోరా, మాయోన్‌ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక కూతురు దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్‌గా పని చేస్తోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హెల్త్ టిప్స్‌తో పాటు హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

Untitled-1 copy.jpgdivaysathyaraj.jpg


ఇక మన కట్టప్ప అలియాస్ సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన కోలీవుడ్‌లో స్టార్ హీరోగా సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. వయసు మీరడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. కేవలం కోలీవుడ్‌కే పరిమితం కాకుండా అన్ని సౌత్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లోను నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సినీ, పొలిటికల్ కామెంట్రీ చేస్తూ ఉంటారు.

89.jpg

Updated Date - Dec 26 , 2024 | 03:59 PM