scorecardresearch

Allu Arjun: అయాన్.. ‘మై ల‌వ్ ఆఫ్ లైఫ్’! అల్లు అర్జున్ పోస్ట్ వైర‌ల్

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:18 PM

రెండు తెలుగు రాష్టాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అల్లు అయాన్. ఈరోజు 11వ యేడులోకి అడుగు పెడుతుండ‌డంతో నెటిజ‌న్లు,సెల‌బ్రిటీల నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ‌లా న‌డుస్తోంది.

Allu Arjun: అయాన్.. ‘మై ల‌వ్ ఆఫ్ లైఫ్’! అల్లు అర్జున్ పోస్ట్ వైర‌ల్
allu ayaan

రెండు తెలుగు రాష్టాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అల్లు అయాన్ (Allu Ayaan). అల్లు ఫ్యామిలీ వార‌సుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క‌మారుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. చిన్న‌నాటి నుంచే ఇంట్టో అర్జున్‌తో అయాన్ చేసే అల్ల‌రి వీడియోల‌తో, తండ్రి, తాత‌ల‌తో క‌లిసి సినిమా ఫంక్ష‌న్ల‌కు హ‌జ‌ర‌వుతూ త‌న చిలిపి చేస్ట‌ల‌తో మెగా అభిమానుల‌లో స‌ప‌రేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

GKNsBHWWYAABh75.jpg

అయితే ఈరోజు (బుధ‌వారం) అయాన్ (Allu Ayaan) ప‌ది సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 11వ యేడులోకి అడుగు పెడుతుండ‌డంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు,సెల‌బ్రిటీల నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ‌లా న‌డుస్తోంది. మ‌రో మూడు రోజుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) బ‌ర్త్ డే కూడా ఉండ‌డంతో మెగా, అల్లు వారి అభిమానులైతే త‌మ భ‌ర్త్ డే పోస్టుల‌తో, మీమ్స్‌తో సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ర‌చ్చే చేస్తున్నారు.


ఇదిలాఉండ‌గా.. త‌న కుమారుడు అయాన్ (Allu Ayaan Birthday) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) సామాజిక మాధ్య‌మాల ద్వారా శుభాకాంక్ష‌లు తెలుపారు. ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఫోటోల‌ను జ‌త చేసి ‘మై ల‌వ్ ఆఫ్ లైఫ్’ అంటూ ట్యాగ్ చేసి పోస్టు చేయ‌గా నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి. అదేవిధంగా అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా అయాన్కు సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టా స్టేట‌స్‌లో షేర్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

Updated Date - Apr 03 , 2024 | 04:21 PM