Ariyana Glory: అరియానా అందాల ఆరబోత.. కుర్రకారు ఫిదా! 

ABN , Publish Date - Jan 02 , 2024 | 01:20 PM

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పక్కన ఏ అమ్మాయి కనిపించినా పాపురల్‌ కావడం మాత్రం ఖాయం. అలా పాపులర్‌ అయిన అమ్మాయిలో అరియానా గ్లోరి ఒకరు. యూట్యూబ్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆర్‌జీవీని హాట్‌హాట్‌గా ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటీ తెచ్చుకుంది.

Ariyana Glory: అరియానా అందాల ఆరబోత.. కుర్రకారు ఫిదా! 

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పక్కన ఏ అమ్మాయి కనిపించినా పాపురల్‌ కావడం మాత్రం ఖాయం. అలా పాపులర్‌ అయిన అమ్మాయిలో అరియానా గ్లోరి ఒకరు. యూట్యూబ్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆర్‌జీవీని హాట్‌హాట్‌గా ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఆ క్రేజ్‌తో బిగ్‌ బాస్‌లో ఛాన్స కొట్టేసి ఇంకాస్త జనాల్లో గుర్తింపు పొందింది. పైగా తన యాటిట్యూడ్‌ కూడా ప్రత్యేక ఇమేజ్‌ తీసుకొచ్చింది. అంతే కాదు సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసే హాట్‌ హాట్‌ ఫొటోలు కూడా యూతలో క్రేజ్‌ తీసుకొచ్చాయి. ఈ మధ్‌యన బీచలో బికినీ ధరించి పెట్టిన ఫొటోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో తెలిసిందే. తాజాగా మరోసారి విజృంబించి అందాలు ఆరబోసింది అరియానా. తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. సినిమాల్లో అవకాశాల కోసమే అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే విమర్శలు ఎన్ని వచ్చినా అరియానా మాత్రం తగ్గట్లేదు. రోజు రోజుకు గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది.. వెండితెరపై రాణించాలనే కోరికతో తరచూ అందాల ఆరబోతతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. తన సొగసుతో మేకర్స్‌ చూపు తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Ariyana.jpg

తాజాగా న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా ఎంజాయ్‌ చేస్తున్న ఈ అమ్మడు ఓ స్విమ్మింగ్‌పూల్‌ పక్కన టూ పీస్‌ డ్రెస్‌తో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చింది. బ్లాక్‌ టాప్‌లో ఎద, నాభి అందాలను చూపిస్తూ అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ హాట్‌హాట్‌గా ఉన్న ఆ ఫొటోలను ఇనస్టాలో షేర్‌ చేసింది. ఆ ఫొటోలు చూసిన యువత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె బాడీపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతటి చలిలో కూడా చెమటలు పట్టిస్తోంది అరియానా అంటూ కుర్రకారు కామెంట్లు చేస్తున్నారు. అయినా తగ్గేదేలే అంటుంది ఈ హాట్‌ గర్ల్‌ అరియానా. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

మీరూ ఓ లుక్కేయండి! 

Ariyana-2.jpg

Updated Date - Jan 02 , 2024 | 01:20 PM