AP Elections 2024: మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు.. పుష్ప రూటే సెపరేటు..

ABN , Publish Date - May 12 , 2024 | 06:44 AM

మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య అంతరం అలాగే ఉందా? ఇరు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోలేదా? కొన్ని కారణాల వల్ల ఏర్పడిన గ్యాప్‌ ఇప్పటికీ కొనసాగుతోందా?

AP Elections 2024: మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు.. పుష్ప రూటే సెపరేటు..

మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య అంతరం అలాగే ఉందా?

ఇరు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోలేదా?

కొన్ని కారణాల వల్ల ఏర్పడిన గ్యాప్‌ ఇప్పటికీ కొనసాగుతోందా? (Mega Family vs Allu Family)

అవుననే అంటున్నారు ఇరు కుటుంబాల సన్నిహితులు. అందుకు కారణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఫంక్షన్లు, పండుగలు కలిసి చేసుకున్నా, కలిసే ఉన్నాం అని ఫొటోలు షేర్‌ చేస్తున్నా... తాజా పరిణామాలు చూస్తే ఇరు కుటుంబాల మధ్య అంతరం అలాగే ఉందనిపిస్తుంది. ఎన్నో రకాలుగా క్లారిటీ ఇచ్చినా ఆ మచ్చ మానట్లేదు. పాతతరం మధ్య ఎలాంటి విభేదాలు లేకపోవచ్చు.. ఈతరం హీరోల మధ్య ఉన్నాయనే అనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. (Ap elections 2024)

మెగా ఫ్యామిలీలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిరంజీవి స్టార్‌డమ్‌ను ఆయన ఎప్పుడో దాటుకెళ్లారు. అయినా అన్నయ్య ముందు తమ్ముడిగానే ఉంటారు. ఆ గౌరవాన్ని ఎక్కడా తగ్గించరు. ప్రస్తుతం ఆయన జనసేన (Janasena pitapuram) పార్టీ తరఫున పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచార వేడి మామూలుగా లేదు. జనసేనాని భారీ మెజారిటీతో గెలవాలని, గెలిచి తీరతారని అభిమానులు, మెగా ఫ్యామిలీ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా మెగా హీరోలైన రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి భార్య సురేఖ, నాగబాబు భార్య పద్మజా కూడా ప్రచారంలో భాగమయ్యారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది నటీనటులు, దర్శకనిర్మాతలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఇతరులు పవన్‌కు మద్దతుగా నిలిచారు. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కూడా ఇటీవల తన తమ్ముడిని గెలిపించాలని పిఠాపురం ప్రజల్ని కోరుతూ ఓ వీడియో వదిలారు. శుక్రవారం ఉదయం రామ్‌చరణ్‌, సురేఖ, కుక్కుటేశ్వరస్వామివారిని దర్శించుకున్న అనంతరం పవన్‌ను కలిసి మద్దతు తెలిపారు. వీరితోపాటు అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. అయితే ముందు ప్రకటనలో సురేఖ, రామ్‌చరణ్‌ పేర్లే వినిపించాయి. కట్‌ చేస్తే ఉదయాన్నే పిఠాపురంలో అల్లు అరవింద్‌ కూడా దర్శనమిచ్చారు. ఇదంతా ఒకెత్తు అయితే స్టైలిస్‌స్టార్‌ అల్లు అర్జున్‌ రూట్‌ మాత్రం సెపరేట్‌గా కనిపించింది. (Allu arjun supports YCP leader)

పిలవని పేరంటానికి బన్నీ (Allu arjun)

మెగాఫ్యామిలీ అంతా పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) వైపు ఉంటే.. అల్లు అర్జున్‌ మాత్రం నా రూట్‌ సెపరేట్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గురువారం ఆయన కూడా పవన్‌కు మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కానీ తెల్లారేసరికి నంద్యాల నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రవిచంద్ర కిషోర్‌రెడ్డికి సపోర్ట్‌గా వెళ్లడం చర్చనీయాంశమైంది. మేనమామకు ట్వీట్‌తో సరిపెట్టి, అపోజిట్‌ పార్టీలో ఉన్న అభ్యర్థి కోసం ప్రత్యేకంగా నంద్యాల వెళ్లి మద్దతు పలకడం పట్ల అటు మెగా అభిమానులు, సామాన్య ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. పైగా తన స్నేహితుడైన రవిచంద్ర కిషోర్‌రెడ్డి ప్రచారం కోసం పిలవకపోయినా స్నేహితుడికి తన వంతు సపోర్ట్‌గా నిలివాలని స్వతహాగా వచ్చానని బన్నీ చెప్పడంతో మెగా అభిమానులు మరింత మండిపడుతున్నారు. మెగా ఫ్యామిలీ అంతా సైనికుల్లాగా పవన్‌కోసం కష్టపడుతుంటే బన్నీ ఏంటి ఇలా చేశాడని బాహాటంగానే విమర్శిస్తున్నారు. కుటుంబంలో ఎన్ని ఉన్న ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన అవసరం ఉందని బన్నీకి హితవు పలుకున్నారు. బన్నీ యాంటీ ఫ్యాన్స్‌ అయితే అతను చేసింది న్యాయమైన చర్య కాదని కామెంట్స్‌ చేస్తున్నారు.

బన్నీ చర్యలకు అర్ధాలే వేరులే...

ఈ రచ్చ ఎక్కడ మొదలైంది అంటే.. సరైనోడు సినిమా సక్సెస్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ గురించి చెప్పమని అభిమానులు కోరగా ‘చెప్పను బ్రదర్‌’ అని బన్నీ వ్యాఖ్యానించారు. అప్పట్లో దానిపై పెద్ద చర్చే జరిగింది. అప్పటి నుంచే మెగా అభిమానులు రెండు వర్గాలు విడిపోయారనే కామెంట్స్‌ అప్పట్లో వినిపించాయి. అప్పటి నుంచే మెగా వర్సెస్‌ అల్లు అనే ట్యాగ్‌ వచ్చింది. స్టార్‌డమ్‌ పెరుగుతున్న కొద్దీ బన్నీ తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ ఉండాలనీ, మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా అల్లు అర్జున్‌ అంటే ఓ బ్రాండ్‌ అని మార్కెట్‌లో తెలియ చెప్పాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. నేషనల్‌ అవార్డ్‌ వచ్చిన తర్వాత అది మరింత పెరిగిందని యాంటీ ఫ్యాన్స్‌ కామెంట్‌. ఈ కట్టే కాలే వరకూ మెగా అభిమానినే అని చెప్పిన ఆయన ఇటీవల ఓ వేదికపై అల్లు ఆర్మీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని విభజించి మాట్లాడుతున్నారు. అయితే అల్లు అర్జున్‌కు ఆర్మీ ప్రారంభమైంది పుష్పకు నాలుగు సినిమాల ముందు నుంచే అంతకు ముందు అంతా బన్నీని అభిమానించింది మెగా అభిమానులే అని అర్జున్‌ మరచిపోతున్నారని మెగా ఫ్యాన్స్‌ గుర్తు చేస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అల్లు స్టూడియోస్‌ ప్రారంభించిన సమయంలో అల్లు అర్జున్‌ కనీసం చిరంజీవి ఫొటోను ఎక్కడా షేర్‌ చేయలేదు. చిరంజీవికి పద్మభూషణ్‌ ప్రకటించిన సందర్భంలోనూ బన్నీ త్వరగా స్పందించలేదు. ఇలాంటి పలు కారణాలను సాకుగా పెట్టుకుని మెగా, అల్లు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మాటల యుద్దాలు చేసుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్‌కు జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంలోనూ మెగా ఫ్యామిలీ నుంచి అంతగా స్పందన రాలేదని బన్నీ అభిమానుల కామెంట్‌.

అల్లు అరవింద్‌ కవరింగ్‌ కోసమేనా...

శుక్రవారం ఉదయం రామ్‌చరణ్‌, సురేఖ, కుక్కుటేశ్వరస్వామివారిని దర్శించుకున్న అనంతరం పవన్‌ను కలిసి మద్దతు తెలిపారు. వీరితోపాటు అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. అయితే శుక్రవారం ఇచ్చిన ప్రకటనలో సురేఖ, రామ్‌చరణ్‌లు మాత్రమే పిఠాపురం వెళ్తున్నారని తెలిపారు. కట్‌ చేస్తే ఉదయాన్నే పిఠాపురంలో అల్లు అరవింద్‌ కూడా దర్శనమిచ్చారు. అయితే ఆయన పిఠాపురం వచ్చింది కవరింగ్‌ కోసమేనని టాక్‌ వినిపిస్తోంది. ఆయన తనయుడు బన్నీ నంద్యాల వెళ్లడం గమనించి చిరు కుటుంబం నుంచి మాట రాకుండా బ్యాలెన్స్‌ చేయడం కోసమే అరవింద్‌ పిఠాపురం వెళ్లారని టాక్‌ బలంగా వినిపిస్తోంది. 'బన్నీ నువ్వు చేసింది కరెక్ట్‌ కాదని చెప్పకుండా ఇలా కవరింగ్‌, బ్యాలెన్స్‌ చేయడానికి రావడం కరెక్ట్‌ కాదని' మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బన్నీపై విపరీతంగా ట్రోలింగ్‌ జరుగుతోంది. ఈ పరిణామాల వల్ల తర్వాత పరిస్ధితులు ఎలా ఉంటాయో! మెగా, అల్లు కుటుంబాల మధ్య ఈ అంతరాలు తొలగేది ఎప్పుడో!

Updated Date - May 12 , 2024 | 06:54 AM