సుమ ఆంటీ వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్న జ‌నం

ABN , Publish Date - Feb 09 , 2024 | 08:07 PM

ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న‌దెవ‌రైనా అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు కుమారి ఆంటీ. తాజాగా ఆమెను అనుక‌రిస్తూ ప్ర‌ముఖ యాంక‌ర్‌ సుమ చేసిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

సుమ ఆంటీ వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్న జ‌నం
suma

ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న‌దెవ‌రైనా అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు కుమారి ఆంటీ (Kumari Aunty). ఏ ముహుర్తానా ఆమె ఫుడ్ వీడియో, రెండు లివ‌ర్లు ఎక్స్‌ట్రా వెయ్యి రూపాయ‌లు అనేది వైర‌ల్ అయిందో గానీ ఆ రోజు నుంచి ఆమె సెల‌బ్రిటీగా మారిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు. ఎక్క‌డ విన్నా ఆమె పేరే మారు మ్రోగి పోతోంది.

ఓవ‌ర్ నైట్ పాపులారిటీ తీసుకు రావ‌డ‌మే కాక రోజురోజుకి కుమారి ఆంటీ (Kumari Aunty)కి క్రేజ్ పెరుగుతుండ‌డంతో ఆమెతో ప్ర‌ముఖ టీవీ ఛాన‌ళ్లు ప్ర‌త్యేక షోలు ఏర్పాటు చేస్తున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికితే అన్న చందాన మ‌న నెటిజ‌న్లు రీల్స్ చేస్తూ.. చేసే హ‌డావుడి అయితే చెప్ప‌లేని విధంగా ఉంటోంది. లేచిందే లేడికి ప‌రుగు, కొత్తోక వింత పాతోక‌ రోత అన్న‌ట్లుగా ప్ర‌స్తుతం యువ‌త‌ సిట్యుయేష‌న్‌ ఉంది.


ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ యాంక‌ర్‌ సుమ (Anchor Suma) కూడా కుమారీ ఆంటీ (Kumari Aunty)ని మ‌క్కీ టు మ‌క్కీ అనుక‌రిస్తూ తాజాగా ఓ వీడియోను చేయ‌గా.. సామాజిక మాధ్య‌మాల్లో అది బాగా వైర‌ల్ అవుతోంది. కుమారీ ఆంటీలానే భోజనం వడ్డిస్తూ.. ఆమె డీజే సాంగ్‌కు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అద‌ర‌గొట్టింది. అయితే మ‌ధ్య‌లో రెండు మూడు సార్లు బ్ర‌హ్మాజీ క్లిప్‌ను కూడా వాడ‌డంతో నెటిజ‌న్లు బాగా లైక్ చేస్తుండ‌డ‌మే కాక చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. కొంద‌రైతే బ్ర‌హ్మాజీ గారూ.. మీకు చెప్ప‌కుండా మీ వీడియో వాడారు సుమ (Anchor Suma). ఆమెపై కేసు వేయండి అంటూ చ‌మ‌త్క‌రించారు కూడా.

Updated Date - Feb 09 , 2024 | 08:49 PM