రామ్ చరణ్ హీరోయిన్ కి మళ్ళీ పెళ్లి, వరుడు ఎవరంటే...

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:43 AM

రామ్ చరణ్ పక్కన 'ఎవడు' సినిమాలో కథానాయకురాలిగా నటించిన అమీ జాక్సన్ మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది. ఇదివరకే పెళ్లయి ఒక కుమారుడు కూడా వున్న అమీ జాక్సన్ మొదటి భర్తతో విడిపోయి, ఇప్పుడు రెండో పెళ్ళికి ఒక బ్రిటిష్ నటుడితో నిన్న ఎంగేజ్ మెంట్ ఉంగరాలు మార్చుకుంది.

రామ్ చరణ్ హీరోయిన్ కి మళ్ళీ పెళ్లి, వరుడు ఎవరంటే...
Actor Ed Westwick proposes Amy Jackson in Switzerland

'ఎవడు' సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన అమీ జాక్సన్ గుర్తుందా? ఇంగ్లాండ్ లో పుట్టి, అక్కడే పెరిగి, భారతదేశం వచ్చి, తమిళ సినిమాతో ఆరంగేట్రం చేసిన అమీ జాక్సన్ తరువాత తెలుగు, కన్నడ, హిందీ సినిమాలు చాలానే చేసింది. అందులో తమిళ సినిమాల్లోనే ఎక్కువ నటించింది అమీ జాక్సన్. ఇంతకు ముందు అమీ జాక్సన్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనయియోటౌ కుమారుడైన హోటల్ వ్యాపారి జార్జ్ పనయిటౌతో కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసింది. అతను జనవరి 1, 2019న, జాంబియాలో పెళ్లి ప్రతిపాదించారు, ఆ తరువాత వారికి ఒక కుమారుడు సెప్టెంబర్ 19, 2019న జన్మించాడు. కుమారుడి పుట్టిన తరువాత ఈ జంట విడిపోయారు.

amyjacksonedwestwick.jpg

అమీ జాక్సన్ జార్జి తో విడిపోయిన తరువాత 2022 నుండి నటుడు, మ్యూజిషియన్ అయిన ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ ప్రారంభించింది. నిన్న అంటే జనవరి 29, 2024న అతను స్విట్జర్ ల్యాండ్ లోని ఒక వంతెనపై అతను అమీ జాక్సన్ కి తనని వివాహం చేసుకుంటాను అని ప్రతిపాదించగా అమీ జాక్సన్ అందుకు అంగీకరించింది. ఇప్పుడు ఆమె వెస్ట్‌విక్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్టయింది. ఎడ్ వెస్ట్‌విక్‌ 'గాసిప్ గర్ల్' అనే సినిమాతో బాగా ప్రసిద్ధి చెందాడు. వీరిద్దరూ తమ వివాహ వివాహ ఉంగరాలను మార్చుకున్నారని తెలిసింది.

ఎడ్ వెస్టిక్ తనకి వివాహానికి ప్రతిపాదించిన ఫోటోలను అమీ జాక్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. "హెల్ అవును," అని ఆమె ఆ పోస్ట్‌కు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. కొన్నాళ్ల పాటు ముంబై లో వుంది ఇక్కడి సినిమాలలో చేసిన అమీ జాక్సన్ రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ చిత్రంలో కూడా నటించింది తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్ లో నివాసం వుంటున్నట్టుగా తెలుస్తోంది.

Updated Date - Jan 30 , 2024 | 11:43 AM