సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saindhav Trailer is out: నా తల తీసుకెళ్లాలంటే, ముందు మీ తలలుండాలి కదరా...

ABN, Publish Date - Jan 03 , 2024 | 11:41 AM

వెంకటేష్ దగ్గుబాటి నటించిన 75వ సినిమా 'సైంధవ్'. ఇది ఒక యాక్షన్ మూవీగా తెరకెక్కించారు, ఈనెల 13న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఇందులో వెంకటేష్ ని ఇంతకు ముందు చూడనంత యాక్షన్ నటుడుగా ఇందులో చూడొచ్చు అని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. శ్రద్ధ శ్రీనాథ్ కథానాయిక, నవాజుద్దీన్ సిద్దిఖి, తమిళ నటుడు ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా ఇంకా చాలామంది నటీనటులు వున్నారు. 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను దీనికి దర్శకుడు. ఈ కథంతా ఒక పాప చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతోంది. పాపకి ఒక వ్యాధి రావటం, దానికి అయ్యే మెడిసిన్ కోట్ల రూపాయలలో ఉండటం, ఈ నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది ట్రైలర్ చూస్తుంటే. దీనికి సంగీతం సంతోష్ నారాయణ్ సమకూర్చారు. సంక్రాంతి పండగ పోటీలో మిగతా నాలుగు సినిమాలతో పాటు ఈ 'సైంధవ్' కూడా వుంది.

Updated Date - Jan 03 , 2024 | 05:01 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!