Happy Birthday Allu Arjun: గంగమ్మగా అల్లు అర్జున్, 'పుష్ప 2' టీజర్ అదిరింది

ABN, Publish Date - Apr 08 , 2024 | 11:25 AM

అల్లు అర్జున్ పుట్టినరోజు ఈరోజు (ఏప్రిల్ 8), అందుకని అతను నటిస్తున్న 'పుష్ప 2' సినిమా నుండి టీజర్ విడుదలైంది. సుకుమార్ దర్శకుడు, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ఈ సినిమాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ గంగమ్మగా కనిపించిన వీడియో విడుదల చేశారు నిర్మాతలు. ఇందులో అల్లు అర్జున్ వేషం, నడక అభిమానులను అలరించేవిగా ఉండటమే కాకుండా, సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశంగా చెపుతున్నారు. కొన్ని నిముషాలపాటు వుండే ఈ మొత్తం సన్నివేశం ప్రేక్షకులకి వొళ్ళు గగుర్పాటు కలిపించే విధంగా చిత్రీకరించారని టాక్ నడుస్తోంది. ఇలాంటి సన్నివేశాలు 'పుష్ప 2' సినిమాలో చాలానే ఉన్నాయని అంటున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజునాడు విడుదలైన ఈ టీజర్ తో ఈ 'పుష్ప 2' సినిమాపై అంచనాలు మరింత పెరిగింది అని చెప్పొచ్చు.

Updated at - Apr 08 , 2024 | 11:25 AM