Laila: ‘లైలా’ మూవీ సోనూ మోడల్ ఫుల్ వీడియో సాంగ్
ABN, Publish Date - Dec 29 , 2024 | 12:46 PM
మాస్ కా దాస్ విశ్వక్సేన్ వైవిధ్యభరిత పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఫిబ్రవరి 14న విడుదలకానున్న ఈ మూవీ నుండి మేకర్స్ ‘సోనూ మోడల్’ అనే వీడియో సాంగ్‌ని వదిలారు.
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ చిత్రం ‘లైలా’తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్‌లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా, మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అది మంచి స్పందనను రాబట్టుకుంది.
ఇందులో విశ్వక్సేన్ అద్భుతమైన స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించారు. మోడరన్ అవుట్ ఫిట్‌లో స్పోర్టింగ్ షేడ్స్, గోల్డ్ యాక్ససరీస్ ధరించి కూల్ అండ్ కాన్ఫిడెంట్‌గా కనిపించారు. అతని పాత్రను, సోను మోడల్‌గా ప్రజెంట్ చేస్తూ, అతను మెడపై పచ్చబొట్టు, చేతులపై ‘సోను లవర్, సోను కిల్లర్’ అని రాసి ఉన్న టాటూలతో కనిపించాడు. ఆ టాటూలకు అర్థాన్నిచ్చేలా మేకర్స్ ‘సోను మోడల్’ పేరుతో ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్ మంచి ఆదరణను రాబట్టుకుంటోంది.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్
Also Read-Tammareddy Bharadwaja: సీఎంతో భేటీకి చిరంజీవి కుటుంబం నుంచి ఎందుకు వెళ్లలేదో...
Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..
Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Dec 29 , 2024 | 12:46 PM