Operation Valentine trailer: ఏం జరిగినా చూసుకుందాం

ABN, Publish Date - Feb 20 , 2024 | 02:40 PM

వరుణ్ తేజ్, మానుషి చిల్లర జంటగా నాయిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం చేయగా, సోనీ పిక్చర్స్ ఇంటర్ నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా నిర్మాతలు. ఇది ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చే ఒక చారిత్రాత్మక సినిమా అని అంటున్నారు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. మార్చి 1న విడుదలవుతున్న ఈ సినిమాలో ఇంకా నవదీప్, రుహాని శర్మలు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హిందీ ట్రైలర్ సల్మాన్ ఖాన్ విడుదల చెయ్యగా, తెలుగు ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేశారు.

Updated at - Feb 20 , 2024 | 02:40 PM