Devara: దేవర పార్టు వన్ మొదటి ప్రచార వీడియో విడుదల

ABN, Publish Date - Jan 08 , 2024 | 04:39 PM

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా శివ కొరటాల దర్శకావటంలో వస్తున్న 'దేవర' సినిమా మొదటి పార్టు ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమా మొదటి ప్రచార వీడియోని ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమా కథా నేపధ్యం సముద్రం మీద జరిగే దొంగతనాలు, దోపిడీల ఆధారంగా ఉంటుంది అనేది అర్థం అవుతోంది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వున్నారు. ప్రఖ్యాత సాబు సిరిల్ ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగులోనే కాకుండా, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతోంది.

Updated at - Jan 08 , 2024 | 04:41 PM