Robinhood: వన్ మోర్ టైమ్.. జివి మార్క్

ABN, Publish Date - Nov 25 , 2024 | 08:41 PM

హీరో నితిన్ యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్‌హుడ్‌’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరింత బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ 'వన్ మోర్ టైమ్' అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ నవంబర్ 26న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. పక్కా జివి మార్క్ తో కనిపిస్తున్న ఈ ప్రోమోపై ఓ లుక్ వేసేయండి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.

Updated at - Nov 25 , 2024 | 08:41 PM