Anaganaga Oka Raju: అంబానీలకు మించిన పెళ్లి.. పొట్ట చెక్కలై పోవాల్సిందే

ABN, Publish Date - Dec 26 , 2024 | 02:24 PM

Anaganaga Oka Raju: యంగ్ సెన్సేషన్ నవీన్‌ పోలిశెట్టి ఎక్కడుంటే అక్కడ నవ్వులే. తాజాగా ఆయన ప్రీ వెడ్డింగ్ వీడియో వచ్చేసింది. నవీన్‌కి పెళ్లి ఎప్పుడు ఫిక్స్ అయ్యింది అని షాక్ అవుతున్నారా? ఈ వీడియో చూసేయండి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

యంగ్ సెన్సేషన్ నవీన్‌ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌’, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌’ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 2022లో రాజుగాడి పెళ్లి పేరుతో టీజర్‌ రిలీజ్ చేసిన మూవీ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రాజు గాడి ప్రీ వెడ్డింగ్ వీడియో పేరుతో అంబానీలకు మించిన ప్రీ వెడ్డింగ్ వీడియోని రిలీజ్ చేశారు. నవీన్ సరసన ట్రెండింగ్ బ్యూటీ మీనాకి చౌదరి నటిస్తున్నారు.

Updated at - Dec 26 , 2024 | 02:32 PM