Sahya: మైథలాజికల్ చిత్రం సహ్య.. ఫస్ట్ లుక్ విడుద‌ల చేసిన హీరో అర్జున్

ABN , Publish Date - Apr 25 , 2024 | 07:15 PM

మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రం ‘సహ్య’. సుధా క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ జుకంటి, భాస్కర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను యాక్ష‌న్ కింగ్‌ హీరో అర్జున్ విడుదల చేశారు.

Sahya: మైథలాజికల్ చిత్రం సహ్య.. ఫస్ట్ లుక్ విడుద‌ల చేసిన హీరో అర్జున్
sahya

మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రం సహ్య (Sahya). సుధా క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ జుకంటి, భాస్కర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను యాక్ష‌న్ కింగ్‌ హీరో అర్జున్ (Arjun) విడుదల చేశారు.

sahya.jpeg

ఈ సందర్బంగా అర్జున్ (Arjun) మాట్లాడుతూ.. "కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా ఉన్నాయి. ఈమ‌ధ్య‌ మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఫీమేల్ లీడ్ సినిమాలు మంచి విజ‌యం సాధిస్తున్నాయి, అదే విధంగా ఈ సహ్య (Sahya) సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. ఇదిలాఉండ‌గా సహ్యా (Sahya) సినిమా టీజర్, ట్రైలర్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర దర్శకుడు యాస రాకేష్ రెడ్డి తెలిపారు


arjun.jpg

ఈ సినిమాలో మెయిన్ లీడ్‌లో నటించిన మౌనిక రెడ్డి (mounika reddy) ఇప్ప‌టికే యూట్యూబ‌ర్‌గా మంచి నేమ్ ఉంది, భీమ్లా నాయక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అన్నారు. అలాగే బలగం, రాజాకర్ సినిమాల్లో మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించిన సంజయ్ కృష్ణ సహ్య (Sahya) సినిమాలో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో నటించారు. వీరితో పాటు రవీందర్ రెడ్డి, సుమన్, భాను, నీలేష్, ప్రశాంత్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 08:10 PM