Biggboss 8: యష్మి వెళ్తూ వెళ్తూ గట్టిగా ఇచ్చేసింది.. 

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:48 AM

బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి యష్మి గౌడ ఎలిమినేట్‌ అయింది. ఈ వారం ప్రేక్షకుల ఆమెకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె హౌస్‌ నుంచి బయటకు వెళ్తున్నట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించారు.

బిగ్‌బాస్‌ సీజన్‌-8 (Biggboss8) నుంచి యష్మి గౌడ (yashmi gowda)ఎలిమినేట్‌ అయింది. ఈ వారం ప్రేక్షకుల ఆమెకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె హౌస్‌ నుంచి బయటకు వెళ్తున్నట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించారు. 12వ వారానికి సంబంధించి ప్రేరణ, నబీల్‌, పృథ్వీ, యష్మి, నిఖిల్‌ నామినేషన్స్‌లో ఉండగా, చివరి వరకూ పృథ్వీ, యష్మిల మధ్య ఎలిమినేషన్‌ ప్రక్రియ నడిచింది. చివరకు యష్మి పేరును బిగ్‌బాస్‌ (Eliminations) ప్రకటించాడు. అనంతరం వేదిక పైకి వచ్చిన ఆమె మాట్లాడుతూ.. ఈ వారం నామినేషన్స్‌ ఎలా జరిగాయో అందరికీ తెలుసు. ఈ ట్విస్ట్‌ ఎవరూ ఊహించలేదు. నేను హౌస్‌లో ఉంటానా? లేదా? అన్న విషయం తెలియదు. కానీ నాన్న సూచనల మేరకు గత కొన్ని రోజులుగా అవకాశం దొరికిన ప్రతి చోటా 100 శాతం కష్టపడి ఆడాను’’ అని చెప్పింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న యష్మికి నాగార్జున బిగ్‌బాంబ్‌ రూపంలో పవర్‌ ఇచ్చారు. సోమవారం జరగబోయే నామినేషన్స్‌లో నిఖిల్‌, గౌతమ్‌లలో ఒకరిని నామినేట్‌ చేయాల్సిందిగా సూచించారు. ఈ వారం నిఖిల్‌ నామినేషన్స్‌లో ఉన్నాడని, అందుకనే గౌతమ్‌ను నామినేట్‌ చేస్తున్నట్లు యష్మి చెప్పింది. దీంతో గౌతమ్‌ ఖాతాలో ఒక ఓటు పడింది.

Yashmi-2.jpg

హౌస్‌లో ఉన్న వాళ్లలో ఫ్రెండ్స్‌, ఎనిమీస్‌ ఎవరని నాగార్జున అడగ్గా, బోర్డుపై వాళ్ల ఫొటోలు ఉంచి వారిపై తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది యష్మి.

 
నిఖిల్‌: అతనితో కలిసి హౌస్‌లోకి బడ్డీగా వచ్చాను. నా ఫ్రెండ్‌కున్న క్వాలిటీలు అన్నీ తనలో ఉన్నాయి. నా అభిమాన స్నేహితుడు. ఎవరేమన్నా, మా స్నేహం కంటిన్యూ అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేస్తావన్నది నీకు తెలుసు. అది కరెక్ట్‌ చేసుకో. ఆడియన్స్‌కు కూడా అభిమాన కంటెస్టెంట్‌ అవుతావు.

ప్రేరణ: నువ్వు బాగా ఆడతావు. టాస్క్‌కు వేస్త 100శాతం కష్టపడతావు. చిన్న చిన్న కోపాలు తగ్గించుకుంటే లేడీ విన్నర్‌ అవుతావు. ఆ టాలెంట్‌ నీలో ఉంది.


అవినాష్‌: ఎప్పుడూ నన్ను నవ్విస్తాడు. ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది కాబట్టి, నిన్ను నువ్వు నిరూపించుకో. నువ్వు చేేస కామెడీని అందరూ మెచ్చుకుంటారు.


రోహిణి: నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది.

పృథ్వీ: నా అన్ని విషయాలు అతనితో షేర్‌ చేసుకున్నా. మా సంభాషణ ఎప్పుడూ సరదాగా ఉంటుంది. బయట కూడా అది కొనసాగుతుంది.

విష్ణు ప్రియ: నా బటర్‌ ఫ్లై. చాలా మంచి అమ్మాయి. విష్ణు పెట్టే కాఫీ మిస్సవుతా!

గౌతమ్‌: హౌస్‌లో అందరితో కలిసి ఆడితే నీ గేమ్‌కు బాగా హెల్ప్‌ అవుతుంది. కంప్లయిట్‌ బాక్సులోనూ అదే రాశా. అందరితో నవ్వుతూ ఉండు. ఒంటరిగా గేమ్‌ ఆడొద్దు.

Updated Date - Nov 25 , 2024 | 11:48 AM