Padma Vibhushan: చిరు భాయ్ కంగ్రాట్స్... పద్మ విభూషణ్ చిరంజీవికి అభినందనల వెల్లువ

ABN , Publish Date - Jan 26 , 2024 | 10:10 AM

టాలీవుడ్‌ మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో చిరంజీవికి పద్మ విభూషణ్‌ వరించింది. సినీ ప్రియులు, అభిమానులు గుండెల్లో చెరగని ముద్ర వేసి కోట్లాదిమంది అభిమానుల్ని  సంపాదించుకున్న ఆయన ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన్ను దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం వరించింది ఆయనకు మరో అలంకారంగా నిలిచింది.

Padma Vibhushan: చిరు భాయ్ కంగ్రాట్స్... పద్మ విభూషణ్ చిరంజీవికి అభినందనల వెల్లువ

టాలీవుడ్‌ మెగాస్టార్‌కు (Megastar chiranjeevi) మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో చిరంజీవికి పద్మ విభూషణ్‌ (Padma Vibhushan) వరించింది. సినీ ప్రియులు, అభిమానులు గుండెల్లో చెరగని ముద్ర వేసి కోట్లాదిమంది అభిమానుల్ని  సంపాదించుకున్న ఆయన ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన్ను దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం వరించింది ఆయనకు మరో అలంకారంగా నిలిచింది. సినీరంగానికి చేసిన సేవలతో పాటు కరోనా, లాక్‌డౌన్‌లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

1978లో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ ప్రకటించడంపై చిరంజీవి ఓ వీడియో ద్వారా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ’కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ ప్రకటన విన్న తర్వాత  ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ  సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా.’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

Chiranjeevi.jpg

మోదీకి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు

‘నాకు దక్కిన ఈ గౌరవం మీ అందరిది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ  ఆప్యాయతకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి  నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. మీరు నా పై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసిన  భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఓ వీడియోను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు. మెగాస్టార్‌కు పద్మ విభూషణ్‌ రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు చెబుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. 

మావయ్యకు అభినందనలు: ఉపాసన

మెగాస్టార్‌కు పద్మ విభూషణ్‌ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. తన మావయ్యకు అభినందనలు చెబుతూ ట్వీట్‌ చేసింది. కంగ్రాట్స్‌ మామయ్య అంటూ పద్మ విభూషణ్‌ అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్‌ చేసింది.

చిరు భాయ్‌ కంగ్రాట్స్: మమ్ముట్టి

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్‌ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైన ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు’ అంటూ పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్‌ హీరోలు నాని, మంచు విష్ణు, రాధిక శరతకుమార్‌; కిరణ్‌ అబ్బవరం, తేజా సజ్జా, సత్యదేవ్‌, అడివి శేష్‌, బింబిసార డైరెక్టర్‌ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్‌ ట్విటర్‌ ద్వారా మెగాస్ట్టార్‌కు కంగ్రాట్స్‌ తెలియజేశారు. 



Updated Date - Jan 26 , 2024 | 10:13 AM