VD 12: విజయ్ దేవరకొండ మాస్టర్ ప్లాన్.. ఎవరు ఊహించలేదు
ABN , Publish Date - Dec 27 , 2024 | 07:12 AM
VD 12: వరుస ప్లాప్స్‌తో సతమతవుతున్న విజయ్ దేవరకొండ ఈ సారి ఎవరు ఊహించని మాస్టర్ ప్లాన్‌తో రంగంలోకి దిగనున్నాడు. దీంతో విజయ్ ఈ సారి హిట్టు కొట్టడం గ్యారెంటీ అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాల. 'VD 12' కోసం గౌతమ్, విజయ్ ఏం ప్లాన్ చేశారంటే..
రౌడీ బాయ్ 'విజయ్ దేవరకొండ' హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమా 'VD 12'. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. 2025 సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్ అందరిని తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ పెద్ద మాస్టర్ ప్లానే వేసుకున్నాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే..
అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కొన్ని హిట్ల తర్వాత భారీ డిజాస్టర్లను చవిచూశాడు. దీంతో పాన్ ఇండియా వైడ్ గా తిరిగి అదే క్రేజ్ ని సంపాదించుకోవడానికి ప్లాన్స్ వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో 'VD 12' ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా ఒకటి కాదు రెండు పార్టులుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట మేకర్స్. ఫస్ట్ పార్టుని 2025 సమ్మర్ కి రిలీజ్ చేయనుండగా, రెండవ పార్టుని 2026 ఆరంభంలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ పోలీస్ రోల్ లో కనిపించనున్నారు.
మరోవైపు ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి సత్యదేవ్ యాడ్ అవ్వడం పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసేందుకు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృషని సంప్రదించారు. దీనికి ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో విజయ్ ఈ సారి హిట్టు కొట్టడం గ్యారెంటీ అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. దీంతో దేవరకొండ అభిమానులు డబుల్ కాదు, ట్రిపుల్ ఖుషి అవుతున్నారు.