Vijay Deverakonda: మరోసారి బుక్ అయిన రష్మిక, విజయ్ దేవరకొండ
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:35 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నారా? లేదా ఫ్రెండ్షిపేన? ఈ విషయం వాళ్ళకి మాత్రమే తెలియాలి. అయితే తాజాగా ఈ జంట ఒకే ప్లేస్‌లో కనిపించారు. దీంతో నెటిజన్లు ఏమనుకుంటున్నారంటే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ ఎప్పుడు హాట్ టాపికే. అయితే.. ఆ వార్తలను పట్టించుకోకుండా వీరిద్దరూ చిల్ అవుతూ.. చాలా కూల్‌గా ఉంటారు. ఇటీవల వీళ్లిద్దరి డేటింగ్ రిలేషన్ షిప్ పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న ఈ జంట అస్సల్ పట్టించుకోవడం లేదు. అలాగే వీళ్లిద్దరు కలిసి తిరుగుతున్న ఫోటోలు కూడా బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ జంట ముంబైలో కనపడింది. వీరిద్దరు ముంబైలో ఏం చేస్తున్నారంటే..
సోమవారం ఈ జంట ముంబై ఎయిర్‌పోర్టులో సందడి చేసింది. క్రిస్మస్ హాలిడేస్ నిమిత్తం ఇద్దరు ఫారిన్ ట్రిప్‌కి చెక్కెస్తునట్లు టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలో వైరల్‌గా మారాయి.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. "నేను నా కో స్టార్ ఒకరితో డేటింగ్ లో ఉన్నాను. నా వయసు 35, నేను ఒంటరిగా ఉంటానని మీరు ఎలా భావించారు. రొమాంటిక్ రిలేషన్షిప్ లోకి వెళ్లేముందే నేను ఆ వ్యక్తులతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తాను. నేను ప్రత్యేకించి డేట్‌లకు వెళ్ళాను, ఎవరితోనైతే చాలా కాలం నుండి ఫ్రెండ్షిప్ ఉంటాదో వాళ్ళతోనే బయటకెళ్తాను. నాకు షరతులు లేని ప్రేమ కావాలి. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం తెలుసు" అన్నారు. అయితే ఇప్పటికే రష్మికకి, విజయ్ కి మధ్యలో మంచి స్నేహం ఉంది. దీపావళి కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో విజయ్, రష్మికతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఫిక్స్ చేసేస్తున్నారు నెటిజన్లు.