Venu Udugula: విక్టరీ వెంకటేష్‌తో మల్టీస్టారర్‌!

ABN, Publish Date - Jul 12 , 2024 | 02:11 PM

 'నీదీ నాదీ ఒకే కథ’, 'విరాటపర్వం’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు వేణు ఉడుగుల. తీసింది రెండు చిత్రాలే అయినా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Venu Udugula: విక్టరీ వెంకటేష్‌తో మల్టీస్టారర్‌!



 'నీదీ నాదీ ఒకే కథ’, 'విరాటపర్వం’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు వేణు ఉడుగుల (Venu Udugula). తీసింది రెండు చిత్రాలే అయినా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రచన. తెరకెక్కించే తీరులో అతనికంటూ ఒక స్టైల్‌ ఉంది. సామాజిక బాధ్యత సినిమాలకూ ఉందని నమ్మి, అలాంటి కథలతోనే ప్రయాణం చేస్తున్నారాయన. 'విరాటపర్వం' చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలు అవార్డులు దక్కాయి. తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ ఫేర్‌లో ఉత్తమ నటిగా సాయిపల్లవి, , ఉత్తమ సహాయ నటిగా నందితా దాస్‌ అవార్డులు గెలుచుకున్నారు.  ఇప్పుడు వేణు ఉడుగుల తన మూడో సినిమాపై కసరత్తు చేస్తున్నారు. వెంకటేష్‌ (Venkatesh) కోసం ఆయన ఓ కథ సిద్థం చేస్తున్నట్టు తెలిసింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని  నిర్మించనుంది.

ప్రస్తుతం స్క్రిప్ట్  పనులు జరగుతున్నాయి. ఇదో మల్టీస్టారర్‌ అని సమాచారం. వెంకటేష్‌తోపాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. ఆ యువ హీరోలు ఎవరనేది తెలియాల్సి ఉంది. వెంకటేష్‌ ప్రస్తుతం అనిల్‌ రావిపూడితో ఓ సినిమా ప్రారంభించారు. గురువారం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. అనిల్‌ రావిపూడి సినిమా పూర్తయ్యాకే వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు,అధికారిక ప్రకటన రానుంది.

Updated Date - Jul 12 , 2024 | 02:11 PM