Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిజమేనా?

ABN , Publish Date - May 11 , 2024 | 10:36 AM

'సైంధవ్‌’ చిత్రం తర్వాత మరో అప్‌డేట్‌తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు వెంకటేశ్‌(venkatesh).  ప్రస్తుతం ఆయన కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

Venkatesh:  ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిజమేనా?


'సైంధవ్‌’ చిత్రం తర్వాత మరో అప్‌డేట్‌తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు వెంకటేశ్‌(venkatesh).  ప్రస్తుతం ఆయన కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అనిల్‌ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrantiki vastunnam) అనే పేరు అనుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైందని టాక్‌. మరో పక్క సంగీతం పనులు జోరుగా సాగుతున్నాయని సమాచారం. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. టైటిల్‌ను బట్టి చూస్తే పూర్తిగా వెంకటేష్‌ సక్సెస్‌ ఫార్ములా కుటుంబ కథా చిత్రంలాగే అనిపిస్తుంది.

Meenakshi.jpg

ఇందులో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తుంది. ఓ కథానాయికగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) ఎంపిక కాగా, మరో కథానాయిక కోసం సెర్చింగ్‌లో ఉంది టీమ్‌. భీమ్స్‌ సిసిరోలియో స్వరకర్త. ఇప్పటికే బాణీలు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 

Updated Date - May 11 , 2024 | 10:40 AM