Unstoppable Promo: హలో.. ఆ రాముడు నువ్వు అనుకుంటున్నావా
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:30 PM
నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4 ఏదో ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేశ్ (Venkatesh) ‘అన్‌స్టాపబుల్’ షోలో సందడి చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో (Unstoppable with NBK S4) సీజన్ 4లో తాజా ఎపిసోడ్‌కు వెంకటేశ్ అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. తన మనసులో మహరాజు ఎప్పుడూ వెంకటేశ్ అని చెప్పారు. తన తండ్రి రామానాయుడిని తలచుకొని వెంకటేశ్ భావోద్వేగానికి గురయ్యారు. ఎపిసోడ్ చివర్లో అనిల్ రావిపూడి కనిపించి సందడి చేశారు. బాలయ్య డైలాగ్‌ను వెంకటేశ్, వెంకటేశ్ నటించిన గణేష్ సినిమాలో డైలాగ్‌ను బాలయ్య చెప్పి అలరించారు. 'పెళ్లి కళ వచ్చేసిందే బాలా' పాటకు స్టెప్పులేశారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఉన్న ఫొటోను చూసి పాత రోజులు గుర్తొస్తున్నాయన్నారు నలుగురం స్టూపర్‌స్టార్స్‌లాగా ఉన్నామా అని వెంకీ అనగా బాలయ్య.. కాదు నాలుగు స్తంభాల్లాంటి వాళ్లం అన్నారు.
ఈ నలుగురిలో రాముడు మంచి బాలుడు ఎవరు? అనేలోపు వెంకటేశ్ అందుకుని 'హలో ఏంటి కొంపతీసి నువ్వు అనుకుంటున్నావా?’ అంటూ బాలయ్యను చమత్కరించారు. 'నాగచైతన్యను హగ్ చేసుకుంటే ఏదో తెలియని ఆనందం’ అని వెంకటేశ్ చెప్పారు.
మరో అతిథిగా హాజరైన డి.సురేశ్‌బాబు సరదాగా సంభాషించారు.. వెంకీ షూటింగ్‌లో ఉన్నప్పుడు చెయ్యి ఎత్తి తల వెనకపెట్టాడంటే.. అంతే... అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఆ ప్రోమోను మీరూ చూసేయండి..
Updated at - Dec 24 , 2024 | 01:36 PM