Hanuman: హనుమాన్  చిత్రానికి వెంకయ్యనాయుడు ప్రశంసలు! 

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:29 PM

తేజ  సజ్జా హీరోగా నటించిన  ‘హనుమాన్‌’ చిత్రంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆయన ఈ  చిత్రాన్ని తన  స్నేహితులతో  కలిసి వీక్షించారు. అనంతరం సినిమా పట్ల తన అభిప్రాయాన్ని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పంచుకున్నారు.

Hanuman:  హనుమాన్  చిత్రానికి వెంకయ్యనాయుడు ప్రశంసలు! 

తేజ  సజ్జా హీరోగా నటించిన  ‘హనుమాన్‌’ చిత్రంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆయన ఈ  చిత్రాన్ని తన  స్నేహితులతో  కలిసి వీక్షించారు. అనంతరం సినిమా పట్ల తన అభిప్రాయాన్ని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పంచుకున్నారు. ‘దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన ఆంజనేయస్వామి స్ఫూర్తితో రూపొందించిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్‌ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. అందరూ చక్కగా నటించారు. చిత్రబృందానికి అభినందనలు అంటూ ‘హనుమాన్‌’ టీమ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. 

ప్రశాంత్  వర్మ దర్శకత్వంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుందీ సినిమా. సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. దాదాపు  ఈ చిత్రం రూ. 300 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. దక్షిణాలోనే కాకుండా ఉత్తరాదిలోనూ సినిమాకు స్పందన బావుంది. ప్రశాంత్‌ నీల్‌, యశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ హిందీ వసూళ్లను ఇది బ్రేక్‌ చేసింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్‌ 10 దక్షిణాది చిత్రాల జాబితాలో హనుమాన కూడా స్థానం సాధించింది., ఈ సినిమా సక్సెస్‌ జోరులో ఉన్న దర్శకుడు దీనికి సీక్వెల్‌గా  ‘జై హనుమాన్‌’ను తీయనున్నారు. అది ‘హనుమాన్‌’కు వందరెట్లు ఉంటుందని.. ఆ చిత్రాన్ని అంతర్జాతీయ సినిమాలా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - Jan 30 , 2024 | 03:29 PM