scorecardresearch

Varun Tej: ఆ ఇద్దరు స్నేహితులతో కలిసి నటించాలనుంది!

ABN , Publish Date - Feb 27 , 2024 | 10:29 AM

మెగాప్రిన్స్  వరుణ్  తేజ్‌ తాజాగా నటించిన 'ఆపరేషన్ వాలంటైన్  ’ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. శక్తి ప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో వరుణ్‌.. ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా నటించారు. మానుషి చిల్లర్‌ కథానాయిక.

Varun Tej:  ఆ ఇద్దరు స్నేహితులతో కలిసి నటించాలనుంది!

మెగాప్రిన్స్  వరుణ్ తేజ్‌ (Varun tej) తాజాగా నటించిన 'ఆపరేషన్ వాలంటైన్  ’ (operation valantain) చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. శక్తి ప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో వరుణ్‌.. ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా నటించారు. మానుషి చిల్లర్‌ కథానాయిక. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ వరుస ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కలిసి సూపర్‌హిట్‌ చిత్రం ‘ఫిదా’లో (Fidaa)నటించారు. అందులో ఎన్‌ఆర్‌ఐగా వరుణ్‌, తెలంగాణ అమ్మాయి భానుమతిగా సాయి పల్లవి (Sai pallavi) విశేషంగా ఆకట్టుకున్నారు. దీంతో, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తే  బాగుండని చాలామంది అభిమానులు భావించారు. కానీ, ఇప్పటి వరకూ ఆ కాంబోలో మరో సినిమా రాలేదు. ఈ విషయంపై వరుణ్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇద్దరూ కలిసి నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ‘‘మా కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఆ మేరకు ఇద్దరం కథ విన్నాం. కానీ, ఈసారి చేసే చిత్రం ‘ఫిదా’ను మించి ఉండాలని, లేదంటే చేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయాం’’ అని తెలిపారు. గతంలో తాను నటించిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రానికి సీక్వెల్‌ చేేస ఆలోచన ఉందని చెప్పిన ఆయన ఓ మల్టీస్టారర్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చిన కథ నచ్చకపోవడంతో చేయలేదని అన్నారు.

fida.jpeg

నితిన్‌, సాయిధరమ్‌ తేజ్‌లతో కలిసి ఓ చిత్రం చేయాలనుందనే కోరికను బయటపెట్టారు. ఇండస్ర్టీలో నితిన్‌ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. ఓ సినిమా హిట్‌ అయినా ఫ్లాప్‌ అయినా తదుపరి చిత్రానికి ఒకేలా కష్టపడతానని, ప్రతీ మూవీ ఫలితాన్ని రివ్యూ చేసుకుంటానని పేర్కొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 10:29 AM