Varun Tej: మా ఇద్దరికీ అలాంటి ఆలోచనలు ఉండేవి

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:01 PM

'గాండీవధారి అర్జున’ చిత్రం పరాజయం తర్వాత వరుణ్‌తేజ్‌ (Varun tej) హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆపరేషన్ వాలంటైన్’. దాంతోపాటు 'మట్కా' టైటిల్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నాం. ఇటీవల తన ప్రేయసి లావణ్యా త్రిపాఠిని (Lavanya tripati) పెళ్లి చేసుకున్న ఆయన ఆమె గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు

 Varun Tej: మా ఇద్దరికీ అలాంటి ఆలోచనలు ఉండేవి

'గాండీవధారి అర్జున’ చిత్రం పరాజయం తర్వాత వరుణ్‌తేజ్‌ (Varun tej) హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆపరేషన్  వాలంటైన్’. దాంతోపాటు 'మట్కా' టైటిల్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నాం. ఇటీవల తన ప్రేయసి లావణ్యా త్రిపాఠిని (Lavanya tripati) పెళ్లి చేసుకున్న ఆయన ఆమె గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘సినీ ఇండస్ట్రీలో ప్రతి విషయాన్ని ప్రేక్షకులు అభిమానులు తెలుసుకోవాలనుకుంటారు. అలా మా బంధం గురించి మాట్లాడుకోవడం మాకు ఇష్టం లేదు. అందుకే మా ప్రేమ గురించి ఎవరికీ చెప్పలేదు. మొదట్లో బ్యాలెన్స్‌ చేయడం కష్టంగా ఉన్నా చివరికి సాధ్యమైంది. అందులోను సమస్యలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి స్వేచ్ఛగా ఎటైనా వెళ్లాలనుకునే  వాళ్ళం. కానీ సాధ్యపడేది కాదు. చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సాధించాలి. విజయవంతమైన సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. దాంతో ఇద్దరం  కెరియర్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం. అదే సరైన నిర్ణయం అనిపించింది’’ అని వరుణ్‌తేజ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో వరుణ్‌ పైలట్‌గా నటించారు. మానుషి చిలర్‌ కథానాయిక. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Updated Date - Feb 15 , 2024 | 04:01 PM