Varsha Bollamma: విడాకులకు కారణం ఏంటన్న ప్రశ్నకు సింపుల్‌గా చెప్పేసింది!

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:19 AM

హీరోయిన్ వర్ష బొల్లమ్మ (varsha bollamma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ చక్కని విజయాలు అందుకుంటున్నారు.

Varsha Bollamma: విడాకులకు కారణం ఏంటన్న ప్రశ్నకు సింపుల్‌గా చెప్పేసింది!

హీరోయిన్ వర్ష బొల్లమ్మ (varsha bollamma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. తన మాతృ భాష కన్నడలో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగు. తమిళ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ ఏడాది 'ఊరు పేరు భైరవ కోన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోషల్‌ మీడియాలో సమాజంలో పెరుగుతున్న విడాకులకు కారణమేంటన్న ప్రశ్నకు సరికొత్త సమాధానమిచ్చింది. ఒక్క పదంలో పెళ్లి అని తేల్చి పడేసింది.

ఈ రోజుల్లో విడాకుల సంఖ్య పెరగడానికి అతి ముఖ్య కారణమేంటన్న ఓ యూజర్‌ ప్రశ్నకు ఎక్స్‌ వేదిగా ‘మ్యారేజ్‌’ అని బదులిచ్చిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు అది కూడా నిజమే కదా అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో మంచి పార్ట్‌నర్‌ దొరికితే విడాకులు ఎందుకు తీసుకుంటారు? జీవితాంతం కలిసికట్టుగా ఉంటారని చెబుతున్నారు. అభిమానులు మాత్రం.. ఏంటి వర్ష, కామెడీ చేస్తున్నావ్‌.. కానీ ఒక్క ముక్కలో కరెక్ట్‌ సమాధానం చెప్పావ్‌ అంటున్నారు.

Updated Date - Jul 23 , 2024 | 09:39 PM