Valentine's Day Spl: రీ రిలీజ్‌ అవుతున్న సినిమాలివే! 

ABN , Publish Date - Feb 10 , 2024 | 05:31 PM

మరో నాలుగు రోజుల్లో ప్రేమికుల రోజు రానుంది. ఆ రోజును ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో అని ఇప్పటికే ప్రేమ పక్షులు ప్లాన్  చేసుకునే ఉంటారు. ప్రేమికులు ఒకరికొకరు ఏం బహుమతులు ఇచ్చుకోవాలి అనే సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన చేసుకునే ఉంటారు. కలిసిన రోజు నుంచి ఇప్పటికి దాకా జర్నీ ఎలా సాగిందనేది గుర్తు చేసుకుంటారు.

Valentine's Day Spl: రీ రిలీజ్‌ అవుతున్న సినిమాలివే! 


మరో నాలుగు రోజుల్లో ప్రేమికుల రోజు రానుంది. ఆ రోజును ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో అని ఇప్పటికే ప్రేమ పక్షులు ప్లాన్  చేసుకునే ఉంటారు. ప్రేమికులు ఒకరికొకరు ఏం బహుమతులు ఇచ్చుకోవాలి అనే సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన చేసుకునే ఉంటారు. కలిసిన రోజు నుంచి ఇప్పటికి దాకా జర్నీ ఎలా సాగిందనేది గుర్తు చేసుకుంటారు. ఇలాంటి కథాంశాలతోనే ఎన్నో ప్రేమకథలు వెండితెరపై ఆవిష్కరించబడ్డాయి. ఆ తరహా చిత్రాలు ఈ ప్రేమికుల రోజుల ప్రేమికులను మెప్పించడానికి మరోసారి తెరపై సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం...

Moive.jpeg

పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి జంటగా 1998లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం తొలిప్రేమ. కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికుల మనసును ఆకట్టుకుంది.  పవన్‌కు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రానికి, పాటలకి క్రేజ్‌ తగ్గలేదు. గత ఏడాది రీ - రిలీజ్‌ అయింది. ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి ఈ చిత్రాన్ని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన కాంబోలో వచ్చిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ కూడా రీ రిలీజ్‌ కానుంది.  2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్‌ అయి భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. 

Oy.jpg

సిద్థార్థ్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఓయ్‌’ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్‌గా  నటించింది.  ఆనంద్‌ రంగా దర్శకత్వంలో 2009లో విడుదలైన ఈ చిత్రం చక్కని ప్రేమకథగా గుర్తుండిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ నెల 14న థియేటర్స్‌లోకి వస్తుంది. ఇటీవల ఈ చిత్రం రీ రిలీజ్‌ అని దర్శకుడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయింది.

Nuvvostanu.jpg

పాన్  ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్‌  సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు. ఎమోషనల్‌ లవ్‌ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి  తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్‌ హిట్‌గా నిలిచింది.  ప్రేమికుల రోజు సందర్భంగా  ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో దర్శనమివ్వనుంది.

Journey.jpg

వీటితోపాటు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘జర్నీ’ సినిమాలు విడుదల కాననున్నాయి. అంతే కాదు బాలీవుడ్‌లోని పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్‌ కానున్నాయి.  దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్‌ తో పాగల్‌ హై’, మొహబ్బతే వంటి చిత్రాలు రీ రిలీజ్‌కు క్యూ కట్టాయి. 


Updated Date - Feb 10 , 2024 | 05:31 PM