Ustaad Bhagat Singh: ఊహించనిది ఆశించండి

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:29 AM

‘రెండు మూడ్రోజులుగా పవన్  కల్యాణ్‌ (pawan kalyan) నటిస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh)చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఊహించని సర్‌ప్రైజ్‌ అంటూ

Ustaad Bhagat Singh: ఊహించనిది ఆశించండి


‘రెండు మూడ్రోజులుగా పవన్  కల్యాణ్‌ (pawan kalyan) నటిస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh)చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఊహించని సర్‌ప్రైజ్‌ అంటూ ఇటీవల నిర్మాణ సంస్థ ఓ పోస్ట్‌ చేసింది. తాజాగా  కల్యాణ్‌ వాయిస్‌ ఇస్తున్న ఫొటో ఒకటి మైత్రీ సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి 'ఊహించనిది ఆశించండి' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిని బట్టి చూస్తే ఈ నెల 19న టీజర్‌ విడుదల చేస్తారని తెలుస్తోంది. రాజకీయ సంభాషణలతో ఈ టీజర్‌ రూపొందుతుందని, ప్రస్తుత రాజకీయ వాతావరణానికి తగ్గట్టుగా అది ఉంటుందని సమాచారం.

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. శ్రీలీల కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ చిత్రీకరణని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌ రాజకీయ పర్యటనల కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా ఆగింది. ఎన్నికల తర్వాత సినిమా పునఃప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కొన్ని శక్తిమంతమైన సంభాషణలు ఇందులో  ఉంటాయని, ఇప్పుడు నెలకొన్న ఎన్నికల వాతావరణంలో బయటికొస్తే పవన్‌ రాజకీయ ప్రయాణానికీ, సినిమా ప్రచారానికీ కలిసొస్తాయని చిత్రబృందం భావించినట్టు సమాచారం. ఆ మేరకే టీజర్‌ని సిద్థం చేస్తున్నట్టు తెలిసింది. ‘ఈ నెల 19న ఎవ్వరూ ఊహించనిది’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ పవన్‌కల్యాణ్‌ డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోల్ని షేర్‌ చేసింది.

Updated Date - Mar 18 , 2024 | 10:33 AM