Ustaad Bhagat Singh: నిర్మాణ సంస్థ పోస్ట్‌తో అభిమానుల్లో నూతన ఉత్సాహం!

ABN , Publish Date - Mar 16 , 2024 | 05:20 PM

పవన్‌ కల్యాణ్‌  హీరోగా హరీశ్‌ శంకర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పటికి కొంత మేరకు చిత్రీకరణ జరిగింది.

Ustaad Bhagat Singh: నిర్మాణ సంస్థ పోస్ట్‌తో అభిమానుల్లో నూతన ఉత్సాహం!

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా హరీశ్‌ (harish SHankar) శంకర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పటికి కొంత మేరకు చిత్రీకరణ జరిగింది. గ్లింప్స్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు. అయితే దీనిపై అప్‌డేట్‌ వచ్చి చాలా రోజులు కావడంతో రకరకాల రూమర్స్‌ వినిపించాయి. తాజాగా వాటికి చెక్‌ పెడుతూ నిర్మాణ సంస్థ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచేలా ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి మీరు ఊహించని అప్‌డేట్‌ రానుంది. సిద్థంగా ఉండండి’ అని పేర్కొంది. ఈ చిత్రం నుంచి తాజా అప్‌డేట్‌ రానుందని తెలిసి అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది. ‘టీజర్‌ ఉంటుందా’, ‘కొత్త పోస్టర్‌ విడుదల చేస్తారా’ అని రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు. దీనికి హరీశ్‌ శంకర్‌ కూడా రిప్లై ఇస్తూ ‘నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.


ఈ చిత్రం కోసం పవన్‌ కల్యాణ్‌ మరోసారి పోలీస్‌ అవతారం ఎత్తారు. ఆయన సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌-హరీశ్‌ శంకర్‌ కాంబోలో 11 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా అంచనాలకు మించి ఈ చిత్రం ఉంటుంది’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్  శంకర్‌ చెప్పారు.  

Updated Date - Mar 16 , 2024 | 05:40 PM