This Week Movies: మే రెండోవారం ఈ సినిమాలు, సిరీస్‌లు చూసేయండి!

ABN , Publish Date - May 06 , 2024 | 11:10 AM

మే మొదటివారం వరుసగా చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే పెద్దగా ఆకట్టుకున్న సినిమా ఏదీ లేదు. రెండో వారంలో కూడా చిన్న చిత్రాలదే హవా. పదో తేదీన విడుదల కానున్న సినిమాల (Theatre and OTT) విశేషాలివే!  

This Week Movies: మే రెండోవారం ఈ  సినిమాలు, సిరీస్‌లు చూసేయండి!


మే మొదటివారం వరుసగా చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే పెద్దగా ఆకట్టుకున్న సినిమా ఏదీ లేదు. రెండో వారంలో కూడా చిన్న చిత్రాలదే హవా. పదో తేదీన విడుదల కానున్న సినిమాల (Theatre and OTT) విశేషాలివే!  

Naara.jpg

‘ప్రతినిధి-2’.. (Prathinidhi 2)

‘ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్లు చెప్పింది చేయాల్సిందే, డిసైడ్‌ చేసుకో, నిన్ను ఎవరు పరిపాలించాలో...’ అంటూ ప్రచార చిత్రాలతో ఆసక్తి కలిగించారు నారా రోహిత్. ఆయన కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి- 2’. ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్  గుప్తా తదితరులు కీలక పాత్రధారులు. తొలుత ఏప్రిల్‌ 25న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నా, పలు కారణాల వల్ల  వాయిదా పడింది. ఇప్పుడు మే 10న విడుదల చేస్తున్నారు.

  krishnamma-.jpg

‘కృష్ణమ్మ’.. యాక్షన్ (Krishnamma)
సత్యదేవ్‌ కథానాయకుడిగా వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘కృష్ణమ్మ’. అతీరా రాజ్‌ కథానాయిక. దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి కథతో.. ఎంతో రియలిస్టిక్‌గా రూపొందించామని చిత్ర బృందం చెబుతోంది.

jith.jpeg

యథార్థ సంఘటనలతో.. (jithendar Reddy)
‘ఉయ్యాల జంపాల’తో యువతను ఆకట్టుకున్న దర్శకుడు విరించి వర్మ. కొన్నేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘జితేందర్‌రెడ్డి’. ‘బాహుబలి’తో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే కథానాయకుడు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
apes.jpg

‘ఏప్స్‌’ మళ్లీ వచ్చేస్తున్నాయి..

‘రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ ఫ్రాంచైజీ సినిమాలకున్న క్రేజ్‌ తెలిసిందే! మనుషులకు చింపాజీలకు మధ్య జరిగే యుద్థం నేపథ్యంలో సాగే ఈ కథలు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’. వెస్‌బాల్‌ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. సముద్రతీరంలో ఉండే ఏప్స్‌ను పాలిస్తున్న నియంత ప్రాక్సిమస్‌ సీజర్‌.. మనుషుల టెక్నాలజీ అన్వేషించడం తో పాటు, వారిని అంతం చేయాలనుకుంటుంది. తన సేనలతో కలిసి వెంటాడి మరీ కొందరిని చంపేస్తుంది. అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరించే నోవా అనే యువతిని కూడా హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ వచ్చి అడ్డుకుంటుంది. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రాక్సిమస్‌ సీజర్‌ ఏం చేసింది? నోవా, సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ చేసిన పోరాటం ఏంటి?అన్నది కథ.

ఎమోషనల్‌ థ్రిల్లర్‌..
మోహన్‌ భగత్‌ , సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కళ్యాణ్‌, రవీంద్ర విజయ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’. అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్‌ వీటీ నిర్మిస్తున్నారు.


ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

మే 09: బోడ్కిన్‌ (వెబ్‌సిరీస్‌)

మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్)

థాంక్యూ నెక్ట్స్‌ (వెబ్‌సిరీస్‌)

అమెజాన్‌ ప్రైమ్‌:

మే 09: ఆవేశం (మలయాళం)

ది గోట్‌(వెబ్‌ సిరీస్‌)

మే 10: యోధ (హిందీ)

జీ5

మే 10: 8ఏఎం. మెట్రో (హిందీ)

డిస్నీ+హాట్‌స్టార్‌

మే 08: ఆల్‌ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌ (హాలీవుడ్‌) సోనీలివ్‌

మే 10: అన్‌ దేఖీ 3 (హిందీ సిరీస్‌)

ఆహా

మే 10: రోమియో (తమిళ్‌)

లయన్స్‌ గేట్‌ప్లే

మే 10: ది మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్)

ఆపిల్‌ టీవీ ప్లస్‌

మే 08: డార్క్‌ మేటర్‌ (వెబ్‌సిరీస్)

మే 08: హాలీవుడ్‌ కాన్‌ క్వీన్‌ (వెబ్‌సిరీస్‌)

మే 09: మాక్స్‌టన్‌ హాల్‌ (వెబ్‌సిరీస్‌)

Updated Date - May 06 , 2024 | 11:15 AM