Upasana Konidela: అత్తమ్మ  వడ్డన ఆప్యాయంగా ఉంటుంది.. అప్పుడే  నాకు   అర్థమైంది

ABN , Publish Date - Mar 08 , 2024 | 08:29 PM

తనకు తినడం రాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగా కోడలు ఉపాసన(Upasana). వ్యాపారవేత్తగా ఎంతగానో గుర్తింపు పొందిన ఆమె ఇంట్లో బాధ్యతాయుతమైన కోడలిగా చక్కని పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె అత్త సురేఖతో (Surekha) 'అత్తమాస్‌ కిచెన్’ అని నూతన వ్యాపారం ప్రారంభించారామె.

Upasana Konidela:  అత్తమ్మ  వడ్డన ఆప్యాయంగా ఉంటుంది.. అప్పుడే  నాకు   అర్థమైంది


తనకు తినడం రాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగా కోడలు ఉపాసన(Upasana). వ్యాపారవేత్తగా ఎంతగానో గుర్తింపు పొందిన ఆమె ఇంట్లో బాధ్యతాయుతమైన కోడలిగా చక్కని పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె అత్త సురేఖతో (Surekha) 'అత్తమాస్‌ కిచెన్’ అని నూతన వ్యాపారం ప్రారంభించారామె. ఈ సందర్భంగా 'నవ్య'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అత్త నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. "మా అత్తమ్మ సురేఖగారి నుంచి వంటలు నేర్చుకున్నా. దాంతో పాటు ప్రతి స్త్రీకి ఎంతో ముఖ్యమైన కుటుంబ విలువల్ని నేర్చుకున్నా. అత్తమ్మ- ఈ రోజుకి ఇంట్లో అందరూ తింటే తప్ప తను తినదు. నాకు పెళ్లైన కొత్తల్లో తనని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ తర్వాత ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి తాను ఒక ఇరుసు ఎందుకైందో నాకు అర్థమయింది. అంతే కాదు... తన వడ్డన కూడా చాలా అప్యాయంగా ఉంటుంది. నాకు ఒక పద్థతిగా తినటం తనే నేర్పించింది. ఒకప్పుడు నేను ముందు పెరుగు తిని- ఆ తర్వాత మిగిలినవి తినేదాన్ని. కానీ నాకు అత్తమ్మ- ముందు పప్పు, ఆ తర్వాత కూర, ఆ తర్వాత పచ్చడి, ఆ తర్వాత పెరుగు తినటం నేర్పించింది. ఇది ఎందుకు చెబుతున్నానంటే- మన ముందు తరం వారిలో ఉన్న మంచిని నేర్చుకోవాలి. మొత్తం కుటుంబంలో ఉన్న చిన్నా పెద్ద- అందరూ ఏం తింటారో, ఎవరికి ఏది ఇష్టమో అత్తమ్మకు తెలుసు. మూడు రోజుల క్రితం- పవనకళ్యాణ్‌గారు ఇంటికి వచ్చారు. వస్తారని తెలిసి ఆయనకు ఇష్టమైన బిర్యానీ చేయించారు. ప్రతి రోజు ఏదో ఒక వంట- ఎవరో ఒకరికి వెళ్తూనే ఉంటుంది.

Upasana.jpg

సురేఖ మాట్లాడుతూ ‘‘మా అత్తయ్యగారు అంజనాదేవి గొప్ప కుక్‌. ఆవిడ దగ్గర నుంచి నేను వంట నేర్చుకున్నా. మామయ్య వెంకటరావు గారికి నాన్‌వెజ్‌ చాలా ఇష్టం. శనివారం నాన్‌వెజ్‌ వండేవారు కాదట. అందువల్ల ఆ ఫ్లేవర్‌ వచ్చేలా అత్తయ్య వెజిటేరియన్‌ వంటలు వండేవారు. ఐదారు రకాల ఆకు కూరలతో అత్తయ్య బిర్యానీ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి బిర్యానీ ఎవరూ చేయటం నేను చూడలేదు’’ అని అన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 08:30 PM