Upasana: క్లీంకార, నాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి మావయ్య?

ABN , Publish Date - May 10 , 2024 | 04:28 PM

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్‌ (padma Vibhsuhan Chiranjeevi) పురస్కారాన్ని అందుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరైన సంగతి తెలిసిందే.

Upasana: క్లీంకార, నాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి మావయ్య?

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్‌ (padma Vibhsuhan Chiranjeevi) పురస్కారాన్ని అందుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు చిరు, ఉపాసన మధ్య  జరిగిన సరదా సంభాషణల వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘మావయ్య.. క్లీంకారకు(klinkara), నాకు మధ్య ఉన్న కామన్‌ పాయింట్‌ ఏంటో చెప్పండి?’ అని చిరంజీవిని ఉపాసన (Upasana konidela) అడగ్గా.. ‘క్లీంకార నీకు ప్రతిరూపం’ అని సమాధానమిచ్చారు చిరు. దానికి ఉపాసన.. ‘కాదు, మేమిద్దరం పద్మవిభూషణ్‌? మనవరాళ్లం’ అని నవ్వుతూ చెప్పారు. దానికి చిరు నిజమే కదూ అని అన్నారు.

ఉపాసన తాతయ్య ప్రతాప్‌ సి. రెడ్డికి 2010లో పద్మ విభూషణ్‌ అందుకున్న సంగతి తెలిసిందే! అలాగే ఉపాసన చిరుని మరో ప్రశ్న అడిగారు. 'మావయ్యగారు ఈరోజు మీ ఫీలింగ్‌ ఎలా ఉంది? అని అడగగా.. ఇంత మంచి కోడలు క్లీంకారని ఇచ్చిన తర్వాత అందుకుంటున్న బిగ్గెస్ట్‌ అవార్డ్‌ ఇది’ అని చిరంజీవి చెప్పారు. దీనికి ఉపాసన వావ్ అంటూ ఆనందించారు.  ఇక  రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న తర్వాత చిరంజీవి తన ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘కళామతల్లికి, కళారంగంలో నన్ను వెన్నుతట్టి నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను ప్రేమించి అభిమానించిన అందరికీ, పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. అలాగే చిరంజీవిని ఉద్దేశిస్తూ రామ్‌ చరణ్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. ఆయనతో దిగిన ఫొటోను షేర్‌ చేసి ‘శుభాకాంక్షలు. నాన్న. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అని రాశారు.

Updated Date - May 10 , 2024 | 04:30 PM