Trisha Tweet: డివైన్‌ ఎండ్‌ లెజండరీ మార్నింగ్‌!

ABN , Publish Date - Mar 21 , 2024 | 07:23 PM

మెగాసార్‌ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం ‘విశ్వంభర’. వీరిద్దరూ కలిసి 18 ఏళ్ల కిత్రం స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జోడీ కుదిరింది.

Trisha Tweet: డివైన్‌ ఎండ్‌ లెజండరీ మార్నింగ్‌!



మెగాసార్‌ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం ‘విశ్వంభర’. వీరిద్దరూ కలిసి 18 ఏళ్ల కిత్రం స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జోడీ కుదిరింది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో త్రిష డ్యూయల్‌ రోల్‌ చేస్తుందనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఆమె చిరంజీవి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిలతో కలిసి ఉన్న ఫొటోను 'ఎ డివైన్‌ ఎండ్‌ లెజండరీ మార్నింగ్‌' క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ఈ ఫొటోలతో పాటు ఓ చిన్న కుక్కపిల్లతో త్రిష ఆడుతూ ఉన్న క్యూట్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Trisha-22.jpg

సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. సురభి, ఇషా చావ్లా కీలక పాత్రధారులు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Mar 21 , 2024 | 07:24 PM